కర్ణాటకలో (Karnataka Elections) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీని ఓడించేందుకు తమకు ఉన్న అన్ని మార్గాల్లో ప్రజల వద్దకు వెళ్తున్నాయి. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతిపక్ష పార్టీలు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ప్రచారాన్ని విస్తృతం చేసింది. పార్టీ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివ కుమార్ (DK Shivakumar) తీరిక లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికోసం హెలికాప్టర్లు (Helicopter) వినియోగిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు డీకే శివ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను తనిఖీలు చేశారు.
మే 10వ తేదీన ఎన్నికలు జరుగనుండడంతో శివ కుమార్ హెలికాప్టర్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం దక్షిణ కన్నడ జిల్లాలోని (Dakshina Kannada District) ధర్మస్థలికి (Dharmasthala) చేరుకున్న శివ కుమార్ ను ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. హెలిప్యాడ్ లోనే శివ కుమార్ హెలికాప్టర్ లో సోదాలు జరిపారు. అక్కడ సూట్ కేసులను పరిశీలించారు. నగదు, ప్రలోభ పెట్టే వస్తువులు ఏమీ కనిపించకపోవడంతో ఈసీ సిబ్బంది వెనుదిరిగారు. ఈ తనిఖీలపై ట్రబుల్ షూటర్ శివ కుమార్ స్పందించారు. ‘సోదాలు చేయడంలో తప్పు లేదు. ఎన్నికల సంఘం అధికారులు వారి కర్తవ్యం.. బాధ్యతలను నిర్వర్తించారు. సోదాలకు నేను సంపూర్ణంగా సహకరించా’ అని శివకుమార్ తెలిపారు. కాగా ఈ తనిఖీలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు. మావి సరే.. బీజేపీ నాయకులపై కూడా ఈసీ ఇలాగే స్పందించాలని సూచిస్తున్నారు. బొమ్మై, యడియూరప్ప పర్యటనల విషయంలోనూ తనిఖీలు చేయాలని ఈసీని డిమాండ్ చేశారు.
#WATCH | Flying squad of ECI and officials conducted a check of the helicopter used by State Congress president DK Shivakumar after it reached the helipad at Dharmasthala in Dakshina Kannada. The party's state chief was travelling in the chopper.