»Vijayashanthi Message To Revanth Reddy And Eatala Rajender On Munugode Cash Politics
మనలో మనం కొట్లాడుకుంటే.. KCRకే మేలు: విజయశాంతి వైరల్ ట్వీట్
పరస్పరం విమర్శించుకోకుండా ప్రతిపక్షాలు కలిసి పోరాడాలి. ప్రతిపక్షాలు తన్నుకుంటే బీఆర్ఎస్ పార్టీ పండుగ చేసుకుంటుంది. తమ రెండు పార్టీల మధ్య గొడవలు, కలహాలు అధికార పార్టీకి లాభిస్తాయని విజయశాంతి పేర్కొన్నారు.
ఆరు నెలల కిందట ముగిసిపోయిన మునుగోడు (Mungode) ఉప ఎన్నిక మళ్లీ రచ్చ రేపుతోంది. మళ్లీ రాజకీయాలు మునుగోడు కేంద్రంగా సాగుతున్నాయి. ఆ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) కాంగ్రెస్ రూ.25 కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నగదు ఇచ్చామని నిరూపించాలని.. దీనిపై ప్రమాణం చేసేందుకు చార్మినార్ భాగలక్ష్మి ఆలయానికి వస్తానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసరడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవహరంపై బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanthi) భిన్నంగా స్పందించారు. రేవంత్, ఈటల వెనక్కి తగ్గాలని.. మన లక్ష్యం వేరే అంటూ హితబోధ చేశారు. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ట్విటర్ (Twitter)లో ఆమె వరుస ట్వీట్లు చేశారు.
‘బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ తమ దాడిని ఒకరిపై ఒకరు కాకుండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో. ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ సూచిస్తున్నా. నిరంతర తెలంగాణ (Telangana) ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించింది. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతున్నది. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిది. ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక.. ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటలు, సవాళ్ల దాడులు, బీఆర్ఎస్కు వేడుకలవుతున్నాయి. బీఆర్ఎస్తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ గారు, ఈటలగారు తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో’ అని విజయశాంతి ట్విటర్ లో పోస్టు చేశారు.
ఆమె మాటలు చూస్తుంటే పరస్పరం విమర్శించుకోకుండా ప్రతిపక్షాలు కలిసి పోరాడాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు తన్నుకుంటే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పండుగ చేసుకుంటుందని గుర్తు చేశారు. తమ రెండు పార్టీల మధ్య గొడవలు, కలహాలు అధికార పార్టీకి లాభిస్తాయని ఆమె స్పష్టం చేశారు. మనలో మనం విమర్శించుకోకుండా సీఎం కేసీఆర్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని విజయశాంతి తన పోస్టుల ద్వారా ఈటల, రేవంత్ కు హితవు పలికారు.
దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతున్నది. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిది.