»Kolkata Im Ready To Give My Life To Nation Says Cm Mamata Banerjee In Ramadan
India కోసం ప్రాణం ఇస్తా.. తల వంచేదే లేదు: మమతా బెనర్జీ
ఇటీవల కట్టడాలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చడం, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం.. తాజాగా పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చడంపై మమతా బెనర్జీ స్పందించారు. ప్రజాస్వామ్యం వెళ్లిపోతే అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారు. కానీ ఇవాళ ఏకంగా రాజ్యాంగం మార్చేశారు.
దేశంలో నిరంకుశ పాలన సాగుతోందని.. తాను విచారణ సంస్థలతో యుద్ధం చేస్తున్నానని.. ధైర్యం ఉండడంతోనే పోరాడుతున్నా.. దేశం కోసం నా ప్రాణమైన ఇస్తా అని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress- TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సాగిస్తున్న పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేశారు.. ఇప్పుడు చరిత్రను మార్చేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా కోల్ కత్తాలోని (Kolkata) రెడ్ రోడ్డులో ఉన్న మసీద్ ను మమత సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రజలకు రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్ లో శాంతి (Peace) కావాలని ఆకాంక్షిస్తున్నా. మాకు హింస (Violence) అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా బెంగాల్ లో చెలరేగిన మత ఘర్షణలపై పరోక్షంగా ప్రస్తావించారు. ‘దేశంలో విభజన వద్దు. దేశాన్ని విభజించాలని కోరుకుంటున్న వారికి పండుగ సందర్భంగా ప్రమాణం చేస్తున్నా. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తా. కానీ దేశాన్ని విభజన కానివ్వను’ అని మమతా ప్రమాణం (Pledge) చేశారు. ‘మీరంతా ప్రశాంతంగా ఉండాలి. ఎవరి మాటలు వినిపించుకోవద్దు’ అని విజ్ణప్తి చేశారు.
‘నేను ఓ గద్దర్ పార్టీతో పోరాటం చేస్తున్నా. కేంద్ర విచారణ సంస్థలతో (Central Investigation Agencies) యుద్ధం చేస్తున్నా. నాలో ధైర్యం ఉంది కాబట్టి పోరాడుతున్నా. కానీ తలవంచేది లేదు. బీజేపీ నుంచి కొందరు డబ్బులు తీసుకుని ముస్లిం ఓట్లను చీల్చుతారని కొందరు అంటున్నారు. బీజేపీ కోసం ముస్లిం (Muslim) ఓట్లను చీల్చే ధైర్యం వాళ్లకు లేదు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉంది. ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవరో తెలిసిపోతుంది’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇటీవల కట్టడాలు, చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చడం, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం.. తాజాగా పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చడంపై మమతా బెనర్జీ స్పందించారు. ప్రజాస్వామ్యం వెళ్లిపోతే అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారు. కానీ ఇవాళ ఏకంగా రాజ్యాంగం మార్చేశారు. ఇప్పుడు చరిత్రను మార్చేస్తున్నారు అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.