»Maharashtra Sardar Vallabhbhai Patel Rashtriya Party Merged In Brs Party
మహారాష్ట్ర పార్టీ BRSలో విలీనం.. KCRకు మరాఠా నేతలు జై
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సంచార ప్రచార వాహనాలు ఔరంగబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఈ ప్రచార రథాలకు మరాఠా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)కు మహారాష్ట్ర ఘన స్వాగతం పలుకుతోంది. ఆ రాష్ట్రంలో రెండు సార్లు పర్యటించగా.. అనూహ్య స్పందన లభించి మరాఠా (Maharashtra) రాజకీయాల్లో కేసీఆర్ (KCR) ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో కేసీఆర్ అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఈనెల 24న ఔరంగాబాద్ (Aurangabad)లో సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సమావేశానికి ముందే బీఆర్ఎస్ కు శుభ పరిణామం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ బీఆర్ఎస్ (BRS Party)లో విలీనం కానుంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. బహిరంగ సభలో పార్టీ విలీనానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
మహారాష్ట్రలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీ (Sardar Vallabhbhai Patel Rashtriya Party) బీఆర్ఎస్ లో విలీనానికి సిద్ధమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు బాబా సాహెబ్ శాంతూరావు షెల్కే (Babasaheb Santurao Shelke), ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ బల్ భీమ్ రావు చవాన్ తమ అనుచరులు, మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్ కు జై కొట్టారు. ఈ మేరకు మహారాష్ట్రలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో శనివారం వారు సమావేశమయ్యారు. మరాఠా నేతలకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాగా శాంతూరావు షెల్కే 2019 ఎన్నికల్లో ఔరంగాబాద్ ఈస్ట్ నుంచి పోటీ చేశారు. సోమవారం జరిగే బహిరంగ సభలో మరాఠా నాయకులు సీఎం కేసీఆర్ ను కలవనున్నారు.
మహారాష్ట్ర లోని ఛత్రపతి శంబాజినగర్ (ఔరంగబాద్) జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో ఈ నెల 24వ తేదీన సోమవారం భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఇతర ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సంచార ప్రచార వాహనాలు ఔరంగబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఈ ప్రచార రథాలకు మరాఠా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
మహారాష్ట్రలోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీ తమ పూర్తి మద్దతు BRS పార్టీకే అని తమ పార్టీని BRS పార్టీలో విలీనం చేసి పార్టీ సభ్యులు BRS పార్టీ లో చేరారు. చేరిన వారిలో బాబా సాహెబ్ షెల్కే (అధ్యక్షులు),ప్రొఫెసర్ బల్ భీమ్ రావు చవాన్ ( ఉపాధ్యక్షులు) మరియ కార్యకర్తలు చేరారు pic.twitter.com/JPkLuX1lEw