»Tdp Chief Nara Chandrababu Naidu Likely To Complaint To Central Govt On Yerragondapalem Stone Attack
రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన TDP.. గవర్నర్ కు ఫిర్యాదు.. త్వరలోనే కేంద్రానికి?
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న దాడులు, అరాచకాలపై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఇదే మాదిరి చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగింది. తాజాగా మరోసారి. అంతకుముందు బీజేపీ కీలక నాయకుడు సత్య కుమార్ పై కూడా వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇక జిల్లాల్లో నాయకుల పరిస్థితిపై ఇదే తరహాలో దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ భావిస్తోంది.
గొంతెత్తితే కేసులే.. నిరసన తెలిపితే దాడులే.. ఆగ్రహం వ్యక్తం చేస్తే జైలుకే.. ఇలా ఏపీలో అడుగడుగునా నిర్బంధం.. వేధింపులు కొనసాగుతున్నాయి. తమను విమర్శించిన వారిపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రశ్నించే గళాన్ని తొక్కేస్తోంది. అది సామాన్య మానవుడి మొదలుకుని మాజీ ముఖ్యమంత్రి వరకు ఇదే ధోరణి కొనసాగుతోంది. తాజాగా టీడీపీ (Telugu Desam Party- TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడపైకి (Nara Chandrababu Naidu) రాళ్ల దాడికి అధికార వైఎస్సార్ సీపీ పాల్పడింది. ఈ రాళ్ల దాడి ఘటనను టీడీపీ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై ఊరుకునేది లేదని.. సీఎం జగన్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం భావిస్తోంది. రాళ్ల దాడి ఘటనపై గవర్నర్ (Govrnor)కు ఫిర్యాదు చేయగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెంలో (Yerragondapalem) శుక్రవారం నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ క్రమంలో బాబును లక్ష్యంగా చేసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శనివారం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనపై రాజ్ భవన్ (Raj Bhavan)కు మెయిల్ ద్వారా టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇక ఈ దాడిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఎన్ఎస్ జీ కమెండోలు ఉన్న ఒక పార్టీ అధినాయకుడిపై ఇలాంటి దాడులకు ప్రభుత్వం ఉసిగొల్పుతోందని బాబు ఆరోపిస్తున్నారు.
తనపై దాడి ఒక్కటే కాదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న దాడులు, అరాచకాలపై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఇదే మాదిరి చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగింది. తాజాగా మరోసారి. అంతకుముందు బీజేపీ కీలక నాయకుడు సత్య కుమార్ పై కూడా వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇక జిల్లాల్లో నాయకుల పరిస్థితిపై ఇదే తరహాలో దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ భావిస్తోంది. రాళ్ల దాడి ఘటనపై మొదట యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీని టీడీపీ నాయకులు కలవనున్నారు. ఇక గవర్నర్ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కేంద్ర హోం శాఖ దృష్టికి ఏపీలోని పరిస్థితులపై టీడీపీ బృందం ఫిర్యాదు చేయనున్నారు.