తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీజేపీ నేత లక్ష్మణ్ సవాలు విసిరారు. కేసీఆర్ కి దమ్ముంటే… మనుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాలు విసరడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ప్రజలు బుద్ది చూపిస్తారని ఆయన అన్నారు.
ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం లభించలేదన్నారు.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని ఆయన మండిపడ్డారు. బీసీలకు ప్రధాని మోడీ సముచిత స్థానం ఇచ్చారని, వారికి ఉన్నత పదవులతోపాటు రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబ అప్పుల తెలంగాణగా మర్చారని ఫైర్ అయ్యారు.
సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఓబీసీ నేతలకు ఆయన సూచించారు.