బంగారం అక్రమ రవాణా కట్టడి కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పలువురు కేటుగాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పేస్ట్ రూపంలో, బిస్కెట్లు, లోదుస్తులు, విగ్గుల్లో ఇలా పలు రకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రంయలో 7 కేజీల పుత్తడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి కడ్డీల రూపంలో ఉన్న గోల్డ్‌ను అధికారులు గుర్తించారు. ఈ పుత్తడి విలువ దాదాపు రూ.3.50 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.