జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జనవరి 26వ తేది నుంచి 31వ తేది వరకూ రెడ్ అలర్ట్ ను కొనసాగించనున్నారు. ఈనెల 31వ తేది వరకూ ఎయిర్ పోర్టులో సందర్శకులకు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచారు. ప్రధాన దారిలో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు ప్రత్యేక నిఘాను ఉంచారు. ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో ఈ బందోబస్తును ఏర్పాటు చేశారు. సందర్శకుల ప్రవేశం కూడా పరిమిత సంఖ్యలోనే విధించారు. ప్రయాణికులు కచ్చితంగా అన్ని గుర్తింపు కార్డులను క్యారీ చేయాలని అధికారులు తెలిపారు.