»Mumbai Heavy Rain Forecast Red Alert Issued By Imd
Mumbai: భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షాలకు నగరం మొత్తం స్తంభించిపోయింది. ఈ రోజు కూడా ముంబైలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Mumbai: Heavy rain forecast.. Red alert issued by IMD
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షాలకు నగరం మొత్తం స్తంభించిపోయింది. ఈ రోజు కూడా ముంబైలో భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతో పాటు రత్నగిరి సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు.
నిన్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోయాయి. అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు కురవడంతో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి, పోవాయ్లొ 341 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలకు సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.