»Cm Revanth Reddy There Was A Technical Fault In The Flight In Which Revanth Reddy Was Traveling
CM Revanth Reddy: రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభ కోసం రేవంత్ రెడ్డి ముంబాయి బయలుదేరారు. ఈక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభ కోసం రేవంత్ రెడ్డి ముంబాయి బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ రెడ్డి ముంబాయికి విమానంలో బయలుదేరారు. ఆ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటన్నరపాటు ఆయన విమానంలోనే ఉండిపోయారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముంబాయికి వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న విమానాశ్రయానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం ప్రయాణిస్తున్న ఇండిగో విమాన సర్వీస్ రన్‌వేపైకి వెళ్తుంది. ఈక్రమంలో పైలట్ ఇంజిన్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించి వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. టేకాఫ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ప్రయాణికులను కిందకు దించకుండానే గంటన్నరపాటు నిపుణులు శ్రమించి మరమ్మతులు చేశారు. తర్వాత 4 గంటలకు ఆ విమానం ముంబాయికి బయలుదేరింది.