ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను చూసి నమ్మి ఓ వ్యాపారి లక్షల డబ్బు పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై తెలిపారు.
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను చూసి నమ్మి ఓ వ్యాపారి లక్షల డబ్బు పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై తెలిపారు. ఓ స్థానిక వ్యాపారికి ఈ ఏడాది జనవరిలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ పేరుతో లింక్ వచ్చింది. అందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని నమ్మించారు. అయితే ముందు వేరే యాప్‌ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంత లాభాలు వచ్చాయో మీరే స్వయంగా ఆ యాప్‌లో చూసుకోవచ్చు అన్నారు.
దీంతో వ్యాపారి గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి తన వద్ద ఉన్న రూ.40.67 లక్షలను ఆన్లైన్ ద్వారా వాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. తర్వాత ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫిబ్రవరిలో మళ్లీ మెసేజ్ పంపించారు. పెట్టిన పెట్టుబడికి రూ.19.16 లక్షల లాభాలు వచ్చాయంటూ ఆయన ఆన్లైన్ ఖాతాలో చూపించారు. వెంటనే 15 శాతం ఆదాయపన్ను చెల్లించాలని.. లేకపోతే మొత్తం నగదు సంస్థకు తిరిగి వెళ్లిపోతుందని తెలిపారు. వాళ్లు చెప్పినట్లే చేసేందుకు ప్రయత్నిస్తుండగానే పెట్టుబడి ఖాతాలో వాళ్లు చూపిన రూ.19.16 లక్షలను తీసుకుని జీరో బ్యాలెన్స్ చూపించారు. దీంతో మోసపోయినట్లు అతను తెలుసుకుని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.