»Seizure Of Rs 50 Crore Drugs In Hyderabad Shamshabad Airport With Four Ladies Bags
Drugs: హైదరాబాద్‌లో రూ.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా డ్రగ్స్ తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్(hyderabad) ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. ఆ క్రమంలో అతని వద్ద నుంచి ఏకంగా రూ.50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి అధికారులు మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.
Seizure of Rs 50 crore drugs in Hyderabad shamshabad airport with four ladies bags
హైదరాబాద్(hyderabad) రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు(rajivgandhi airport)లో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. అయితే ఈసారి ఏకంగా 50 కోట్ల రూపాయల విలువైన కొకైన్(drugs)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందడంతో సెప్టెంబరు 1న విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. ఆ క్రమంలో లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ కు వచ్చిన ఓ ఇండియన్ ప్రయాణికుడి వద్ద 5 కేజీల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు అతను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన క్రమంలోనే పట్టుకున్నట్లు తెలిపారు. అయితే అతను కొకైన్‌ను నాలుగు లేడీస్ హ్యాండ్‌బ్యాగుల(ladies bags) అడుగుబాగంలో పొడి రూపంలో దానిని దాచిపెట్టాడు.
అంతర్జాతీయ మార్కెట్లో స్వాధీనం చేసుకున్న 5 కిలోల కొకైన్ విలువ 50 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు(officers) తెలిపారు. ఆ క్రమంలో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దీంతోపాటు ఈ డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ దందాలో స్థానికుల వ్యాపారుల పాత్ర ఉందా? అసలు అతను హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? అనే కోణాల్లో అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే గతంలో కూడా పలు మార్లు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ అక్రమంగా తీసుకెళ్తు పట్టబడింది.