మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఖరారు అయ్యింది. వచ్చే నెలలో ఈ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కానీ అధికార పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదని అందరూ అనుకున్నారు. కాగా.. తాజాగా ఆయన తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది.
మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత సీఎం కెసిఆర్ మునుగోడు అభ్యర్ధిగా ప్రకటించారు. స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రంగంలో దిగారు. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ రంగంలో దింపారు.