• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘నాణ్యతతో ఉన్న మాంసం అమ్మకాలు జరపాలి’

RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్ చికెన్ షాప్‌ల యజమానులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చికెన్ షాపుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త లైసెన్సింగ్ విధానం తెస్తోందని, నాణ్యతతో పాటు పరిశుభ్రత ఉన్న మాంసం అమ్మకాలు జరపాలని సూచించారు.

March 12, 2026 / 12:49 PM IST

గోపి హత్య.. లొంగిపోయిన నిందితుడు

NZB: నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గోపీని హతమార్చింది సమీప బంధువు, వరుసకు మేనల్లుడైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 12, 2026 / 12:49 PM IST

‘డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి’

SRCL: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గీత నగర్ ప్రభుత్వ పాఠశాలలో టాస్క్ ఫోర్స్ సీఐ నటేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలన్నారు విద్యార్థులు పాల్గొన్నారు.

March 12, 2026 / 12:46 PM IST

16, 23న మహా ధర్నా… వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

KMM: నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఈనెల 16న జిల్లా కేంద్రాలలో, 23న సెంట్రల్ లేబర్ ఆఫీస్ హైదరాబాద్‌లో జరిగే మహా ధర్నాలను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు షేక్ సుభహన్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం ఖమ్మం బల్లేపల్లిలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ అదానీ, అంబానీకి దేశ సంపద అప్పచెబుతుంద‌న్నారు.

March 12, 2026 / 12:45 PM IST

‘ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి’

మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. శిక్షణ తరగతులను కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, DCP భాస్కర్ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు.

March 12, 2026 / 12:45 PM IST

సాంబశివరావు పార్థివ దేహానికి రాంచందర్ రావు నివాళులు

HYD: ఆర్థిక, రాజకీయ రంగాల్లో విశిష్ట ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి భౌతిక కాయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. వారి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

March 12, 2026 / 12:42 PM IST

‘ఇంటర్ పరీక్షకు 10 మంది విద్యార్థులు గైర్హాజర్’

PDPL: ధర్మారం మండల కేంద్రంలో ఇవ్వాల నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం రెండు కేంద్రాలలో కలిపి 519 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 509 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు.

March 12, 2026 / 12:35 PM IST

బీజేపీ రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్‌గా రాజశేఖర్ రెడ్డి

VKB: బీజేపీ రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్‌గా వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆయనకు నియామక పత్రం అందజేసింది. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.

March 12, 2026 / 12:34 PM IST

వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు

NRPT: మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామ పంచాయతీలో గురువారం సర్పంచ్ రాజేందర్ గౌడ్ చొరవతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. స్వల్ప సమస్యలు ఉన్నవారికి వైద్యం అందించారు. అవసరమైన వారికి మహబూబ్ నగర్‌లో గురువారం ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి మందులు అందజేశారు. ఈ సేవలపై గ్రామస్థులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

March 12, 2026 / 12:33 PM IST

అక్రమ ఇసుక అరికట్టాలని వినతి

BDK: పాల్వంచ మండలాలలో గత 4 ఏళ్లుగా ఇసుక, మట్టి, కంకర మైనింగ్ కార్యకలాపాలు అధికంగా అక్రమంగా జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. పాల్వంచ మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వెంటనే అరికట్టి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక, మట్టి ర్యాంపులను ప్రారంభించాలని బీజేపీ నాయకులు కలెక్టర్‌కు ఇవాళ ఫిర్యాదు చేశారు.

March 12, 2026 / 12:31 PM IST

లక్డికాపూల్‌లో భారీ ట్రాఫిక్ జామ్

HYD: పీక్ హవర్స్‌లో ట్రాఫిక్ జామ్‌తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్డికాపూల్‌ మెట్రో స్టేషన్ నుంచి RBI వరకు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి, ముఖ్యంగా స్కూల్ వ్యాన్లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 40 నిమిషాలకుపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు.

March 12, 2026 / 12:30 PM IST

కొత్తగూడ మండలంకు డిగ్రీ కళాశాల మంజూరు

MHBD: కొత్తగూడ మండల విద్యార్థులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగూడ, గంగారం మండలాల పరిసర గ్రామాల విద్యార్థులకు సమీపంలోనే ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మండల ప్రజలు, విద్యార్థులు సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.

March 12, 2026 / 12:24 PM IST

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

MLG: వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని MLG జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులకు ఆదేశించారు. ఇవాళ ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.

March 12, 2026 / 12:20 PM IST

‘ప్రభుత్వ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి’

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రజా పాలన – ప్రగతి పాలన’ 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత, MLA కోవ లక్ష్మి, MLC విఠల్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు.

March 12, 2026 / 12:18 PM IST

పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. తప్పిన ప్రమాదం

SRCL: ఇల్లంతకుంట మండలంలో గురువారం ఉదయం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటాపూర్ నుంచి జంగంరెడ్డిపల్లెకు విద్యార్థులతో వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.

March 12, 2026 / 12:15 PM IST