• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని హెచ్చరిక

MNCL: నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామంలోసర్పంచ్ జాడి లక్ష్మి ఆద్వర్యంలో గురువారం 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కిరణం షాప్ యజమానులు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని హెచ్చరించారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని షాప్ యజమానులు సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల మొగిలి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 12, 2026 / 11:39 AM IST

శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి: సర్పంచ్

WGL: ఖానాపూర్(M) దబిర్‌పేట గ్రామంలోని ZP సెకండరీ పాఠశాలలో ఈ నెల 14 జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సురేష్ విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

March 12, 2026 / 11:37 AM IST

మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

MDK: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

March 12, 2026 / 11:36 AM IST

ఇరాన్ పై దాడులు ఆపాలని నిరసన

NRPT: జిల్లాలోని సావర్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరిని నిరసిస్తూ గురువారం ధర్నా నిర్వహించారు. ఇరాన్‌పై చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలపై అడ్డగోలుగా దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థలను అమెరికా ధ్వంసం చేస్తోందని విమర్శించారు.

March 12, 2026 / 11:36 AM IST

​దేవరకొండలో సెగలు పుట్టిస్తున్న ఎండలు

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సరిగ్గా ఉదయం 11:30 గంటల సమయానికే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం.

March 12, 2026 / 11:35 AM IST

ప్రజాప్రతినిధులకు పొంగులేటి దిశానిర్దేశం

ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి నివేదిక” శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు పారదర్శకంగా చేరవేసేలా ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.

March 12, 2026 / 11:33 AM IST

టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు వితరణ

SRD: కల్హేర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో టెన్త్ పేద విద్యార్థులకు నేడు పరీక్ష ప్యాడ్లు పెన్నులు వితరణ చేశారు. ఈ మేరకు గ్రామ ఉపసర్పంచ్ పెరమండ్ల మహేష్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. టెన్త్‌లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఇందులో వార్డు సభ్యులు చంద్రకళ రాజేశ్వర్ గౌడ్ జనార్దన్ గౌడ్ సుమలత నారాయణ ఉన్నారు.

March 12, 2026 / 11:32 AM IST

బామ్మర్ది మరణ వార్తవిని బావ గుండెపోటుతో మృతి

MLG: బామ్మర్ది మరణ వార్త విని బావ గుండెపోటుతో మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలంలో జరిగింది. నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ బావ ఎల్లయ్య తాడ్వాయి మండలంలోని నరసింగాపురం గ్రామంలో బుధవారం గుండెపోటుతో మరణించాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

March 12, 2026 / 11:31 AM IST

దేవరకద్ర ఉల్లి ధరలు క్షీణించాయి

MBNR: దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. క్వింటాల్ ధర 900 నుంచి 1,200 రూపాయల మధ్య ఉంది. 6,000 బస్తాల ఉల్లి రావడంతో మార్కెట్ నిండిపోయింది. రైతులు కష్టపడి పండించిన ఉల్లికి తగిన లాభం పొందకుండా.. వెనక్కి తీసుకెళ్లలేక ఇలాంటి ధరల్లో అమ్ముతున్నారు. వ్యాపారులు వేలంలో పాల్గొని 50 కిలోల ఉల్లిని 450–600 రూపాయలకే విక్రయిస్తున్నారు.

March 12, 2026 / 11:31 AM IST

రచ్చపల్లిలో పోలీసుల కళాజాత ప్రదర్శన

PDPL: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో పోలీసు కళాజాత బృందం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాటలు, నాటికల రూపంలో సైబర్ క్రైమ్, గంజాయి, చేతబడులు వంటి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ రజిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 12, 2026 / 11:31 AM IST

‘వేతనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా’

ADB: ఆశా వర్కర్ల యూనియన్ సభ్యులు బోథ్ MLA అనిల్ జాదవ్‌ను నేరడిగొండలోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని MLA అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు.

March 12, 2026 / 11:30 AM IST

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా దశమంత్ రెడ్డి

JN: బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

March 12, 2026 / 11:25 AM IST

మండల కేంద్రంలో ప్రమాదకరంగా స్తంభం

VKB: ధారూర్ మండల కేంద్రంలోని కుమ్మరిగల్లీలో ఇనుప స్తంభాలని తొలగించాలని అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు. అంతేకాకుండా స్తంభానికి మొత్తం వివిధ రకాల వైర్లు వేలాడదీయడంతో ప్రమాదకరంగా మారిందన్నారు. ఒక్కోసారి ఇనుప స్తంభం నుంచి షాక్ తగులుతుందని స్థానికులు చెబుతున్నారు. స్తంభాలను మార్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.

March 12, 2026 / 11:25 AM IST

ఎమ్మెల్యే బాలు నాయక్ విస్తృత పర్యటన

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ రేపు చందంపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం ముర్పునూతల, బండమీది తండాల్లో CC రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే మండల కేంద్రంలోని కేజీబీవీలో నూతన తరగతి గదులను ప్రారంభించడంతో పాటు, మానవత్ తండాలో నూతన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు.

March 12, 2026 / 11:15 AM IST

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాదగిరి సునీల్ రావు

KNR: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 27 మందిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కరీంనగర్ నుంచి మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావుకు చోటు దక్కింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రామచందర్ రావుకు కేంద్ర మంత్రికి సునీల్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

March 12, 2026 / 11:15 AM IST