మెదక్: పట్టణంలో అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో 46.3 మి.మీ., సర్ధనలో 43.3 మి.మీ., మెదక్ మండలం రాజుపల్లిలో 36.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చేగుంటలో 16 మి.మీ.లకుపైగా వర్షం పడింది.ఈ వర్షం వల్ల మెదక్, హవేలీ ఘనపూర్, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.