MNCL: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గోదావరి నదిలోకి భారీగా వరద రావడంతో జైపూర్ మండలంలో 1, 380 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 624 మంది రైతులకు సంబంధించి 820 ఎకరాల్లో వరి, 525 ఎకరాల్లో పత్తి, 35 ఎకరాల్లో మిరప పంటలకు నష్టం కలిగిందని అధికారులు నివేదిక తయారు చేశారు. గోదావరి తీర ప్రాంతంలో ప్రతి ఏడాది పంటలు మునిగి రైతులకు నష్టం మిగులుతోంది.