RR: షట్టర్ తాళం పగలగొట్టి దొంగతనం చేసిన నిందితులను SDNR పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వివరాలు.. సెప్టెంబర్ 17న ఓ గోడౌన్లో నిందితులు షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.4 లక్షల 21 వేల 292 దొంగిలించారు. గోడౌన్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు, 3 సెల్ ఫోన్లు, రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.