MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో యువత స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ సిద్ధమైన విషయం తెలిసింది. దీంతో చాలా గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. తమ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్నారు.