SRD: నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండ గ్రామంలో మహిళా సమైక్య భవనం నిర్మాణానికి సోమవారం సర్పంచ్ మంజుల శంకర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. స్థానికంగా మహిళ భవనం నిర్మాణానికి సెక్రటరీ సుమ భవన నిర్మాణానికి కొలతల ముగ్గును వేయించారు. మహిళల పొదుపు సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి అవకాశానికి ఉచిత శిక్షణ కార్యక్రమాలకు భవనం ఉపయోగపడుతుందన్నారు.
NLG: త్రిపురారం మండలంలో దివ్యాంగులకు SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నారు. అయితే, మండలంలోని దివ్యాంగులకు కాకుండా ఇతర మండలాల వారికి శిక్షణ ఇస్తుండడంతో స్థానికులకు అన్యాయం జరుగుతోందని అన్ ఎంప్లాయ్ డిజేబుల్ యూత్ ఆప్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బూర నాగయ్య గౌడ్ ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ASF: రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి బవేశ్ మిశ్రని సోమవారం మాజీ MLA ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిశారు. తీర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో అనేక గ్రామాలకు సెల్ సిగ్నల్స్ లేని కారణంగా ప్రజలు, ముఖ్యంగా పింఛన్ దారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సెల్ సిగ్నల్స్ లేని గ్రామాలకు సిగ్నల్స్ అందే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు.
HNK: శాయంపేట మండలం మైలారం గ్రామంలో కోస్టల్ పనుల కారణంగా భూములు కోల్పోయిన రైతులు తమపై వస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కొందరు తమను వేధించారని, డబ్బులు వసూలు చేశారని వ్యాప్తి చేస్తున్న ప్రచారాలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. ఎవరూ వేధించలేదని, ఎలాంటి అధికారులు లేదా నాయకులు డబ్బులు కోరలేదని, తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు
JN: కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి వచ్చిన 224 వినతి పత్రాలను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు గోపీరాం, వెంకన్నతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
JGL: మల్యాల మండలంలోని ఎంఆర్‌వో కార్యాలయంలో మండల ఎంఆర్‌వోకు బీజేపీ కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఉచిత బస్ పథకం మినహా ఇతర హామీలు అమలు కాలేదని, రైతుభరోసా, రూ. 500 గ్యాస్ సిలిండర్, తులం బంగారం వంటి హామీలు నెరవేరలేదని పేర్కొన్నారు.
MNCL: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఆయన దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఉన్న తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గోవిందు నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఇండిపెండెంట్‌గా, టీడీపీ, బీఆర్ఎస్‌ల నుంచి ఒక్కోసారి ఎమ్మెల్యేగా పనిచేశారు.
KMM: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సోమవారం సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీరక్షా ఆసుపత్రి వైద్యురాలు మానస విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని, అపస్మారక స్థితిలో ఉన్నవారికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చో ఆమె వివరించారు.
BDK: సింగరేణిలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రంజాన్ అడ్వాన్స్‌ను ఈనెల 18న చెల్లించనున్నట్లు యాజమాన్యం సోమవారం ప్రకటించింది. పండుగ వేళ ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నిబంధనల ప్రకారం.. సంస్థలోని శాశ్వత ఉద్యోగులకు రూ.25,000, ఇతర కేటగిరీ ఉద్యోగులకు రూ. 12,500 చొప్పున అడ్వాన్స్ అందజేయనున్నారు.
KMM: కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం ఉచిత మెగా హెల్త్ క్యాంపు విజయవంతమైంది. సర్పంచ్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కిషోర్, వైద్యులు రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంపు ప్రారంభించారు. 187 మంది రోగులు ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. 54 మంది రోగులకు రక్త పరీక్ష సేకరణను జరిపి మిగిలిన వారికి మందులు పంపిణీ చేశామన్నారు.
VKB: దౌల్తాబాద్ మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను సీఎండీ తేజస్వి పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ వినియోగం, రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, పవర్ సేవింగ్‌పై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నగర మేయర్ మహంకాళి స్వామి సోమవారం భూమి పూజ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్పొరేటర్ మెరుగు భూలక్ష్మి పాల్గొన్నారు.
MNCL: సీపీఎం అనుబంధ రైతు సంఘం సమావేశం సోమవారం మంచిర్యాలలో జరిగింది. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొండగొర్ల లింగన్న, బోడంకి చందు, ఉపాధ్యక్షులుగా దుర్గ ప్రసాద్, బండారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిలుగా ముడితే వెంకటేష్, శంకరయ్యను ఎన్నుకున్నారు.
WNP: వనపర్తి మున్సిపాలిటీలో 100% పన్ను వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బందికి ఆదేశించారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వసూలు పూర్తి చేయాలని సూచించారు. పట్టణవాసులు బిల్లుల సకాలంలో చెల్లించాలని సూచించారు.
KNR: శంకరపట్నం మండలం తాడికల్ రాజీవ్ రహదారి వద్ద వాటర్ ట్యాంక్ సమీపంలో కారు, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అన్నారం గ్రామానికి చెందిన పాకాల రాఘవరెడ్డి (51) గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం బాధితుడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.