• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రైవేట్ లాడ్జీల నిర్వహకులు నిబంధనలు పాటించాలి’

SRCL: ప్రైవేటు లాడ్జిల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ సూచించారు. లాడ్జిలకు వచ్చే అతిధుల వద్ద పూర్తి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, మైనర్లకు గదులు ఇవ్వవద్దని, లాడ్జీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రికార్డులు సరిగ్గా నిర్వహించాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 5, 2026 / 08:06 PM IST

అనారోగ్యంతో ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ మృతి

ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ గోనెల విజయలక్ష్మి గురువారం అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పాల్వంచలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న సమయంలో ఆమె ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌గా పదవి స్వీకరించి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు.

March 5, 2026 / 08:05 PM IST

రైలు హాల్టింగ్ కోరుతూ ఎంపీకి విన్నపం

GDWL: ఇటిక్యాల రైల్వే స్టేషన్లో తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ నిలపాలని కోరుతూ ఎంపీ డీకే అరుణకు గురువారం BJP శ్రేణులు, గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ హాల్టింగ్ ఎంతో అవసరమని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నేతలు కేకే రెడ్డి, జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.

March 5, 2026 / 08:05 PM IST

సాగు నీటిని అందించాలని రైతుల ధర్నా..!

SDPT: రంగనాయకసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న ఎల్ఎస్ఎం – 2 కాలువ పనులు పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని మాచాపూర్ రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం రంగనాయకసాగర్ వద్ద ఉన్న నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.

March 5, 2026 / 08:05 PM IST

వేం నరేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

WGL: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

March 5, 2026 / 08:05 PM IST

బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు

PDPL: ధర్మారం మండలం నరసింహులపల్లి గ్రామంలో గురువారం బెల్ట్ షాప్ నిర్వాహకుడు కొండ బత్తుల ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అతని దుకాణంలో తనిఖీ చేయగా 7.07 లీటర్ల లిక్కర్ లభ్యమైందని తెలిపారు. దీంతో లిక్కర్ సీజ్ చేసి, ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

March 5, 2026 / 08:04 PM IST

ఈ నెలాఖరులోపు సిసి రోడ్లు పూర్తి కావాలి: ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి పట్టణంలోని గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఆజీఎస్ పథకం కింద మంజూరైన సిసి రోడ్ల నిర్మాణాన్ని ఈనెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 08:02 PM IST

ప్రధానమంత్రి జీవనజ్యోతి చెక్కు అందజేత

NRPT: దామరగిద్ద మండలం పిడెంపల్లికి చెందిన ఎడ్ల వెంకటప్ప కాన్కుర్తి ఎస్బీఐలో ప్రధానమంత్రి జీవనజ్యోతి పాలసీ కట్టాడు. ఇటీవల ఆయన మృతి చెందడంతో నామినీగా ఉన్న అతడి భార్య వెంకటమ్మకు ఎస్బీఐ మేనేజర్ రవీందర్ పాలసీకి సంబంధించిన రూ.2 లక్షల చెక్కును గ్రామస్థుల సమక్షంలో బాధితురాలికి అందజేశారు. ఎస్బీఐ ఖాతాదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ రవీందర్ సూచించారు.

March 5, 2026 / 08:01 PM IST

అడవి పందుల దాడిలో ధ్వంసమైన గోధుమ పంట

ADB: ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామంలో అడవి పందుల దాడిలో ధ్వంసమైన గోధుమ పంటను వ్యవసాయ అధికారులు, నాయకులు పరిశీలించారు. ఆ గ్రామానికి చెందిన రాథోడ్ లత రెండు ఎకరాల పొలంలో వేసిన గోధుమ పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. దీంతో ఆ పంటను గురువారం ఏఈఓ రాజేశ్వర్ రాథోడ్, FBO పద్మజ, BRS పార్టీ సోషల్ మీడియా జిల్లా నాయకులు బాబార్ టైగర్ పరిశీలించారు.

March 5, 2026 / 08:00 PM IST

విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్

NLG: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. గురువారం తిప్పర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదో తరగతి గదిలో విద్యార్థినుల ధైర్యాన్ని అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు.

March 5, 2026 / 08:00 PM IST

దళిత ఉద్యోగిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

NZB: దర్పల్లి మండలంలోని హోన్నజీపేట గ్రామములో దళితుదైనా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై అగ్రకులస్థుడైన జీవన్ రెడ్డి, వారి కులస్థులు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఎసీ తరపున దర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్ఐ సామ శ్రీనివాస్‌లకు వినతి పత్రము అందించారు. బాధితునిపై చెయ్యి చేసుకున్న వెక్తులపై అట్రాసిటీ, కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.

March 5, 2026 / 08:00 PM IST

15వ వార్డులో దోమల మందు పిచికారీ

SRPT: కోదాడ రంజాన్ పండుగను పురస్కరించుకుని కోదాడ మున్సిపాలిటీలోని 15వ వార్డులో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ షేక్ షఫీతో కలిసి గురువారం వార్డులో పర్యటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డులోని గల్లీ గల్లీలో దోమల మందు పిచికారీ చేయించారు.

March 5, 2026 / 08:00 PM IST

జిల్లా మోర్చాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేత

WNP: బీజేపీ వనపర్తి జిల్లా కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి జిల్లా మోర్చాల అధ్యక్షులను ప్రకటించి నియామక పత్రాలను జిల్లా అధ్యక్షుడు నారాయణ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలపడడానికి జిల్లా మోర్చా కమిటీలు అత్యంత కీలకం అన్నారు. జిల్లాస్థాయి వరకు పార్టీలో చురుకుగా పనిచేసే కార్యకర్తలను గుర్తించి బాధ్యతలు అప్పగించామన్నారు.

March 5, 2026 / 08:00 PM IST

వైద్య విద్యార్థికి ఎమ్మెల్యే ఆర్థిక భరోసా

MBNR: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోవడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం వైద్య విద్యార్థి లోకేష్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థిని ఆకాంక్షించారు.

March 5, 2026 / 07:58 PM IST

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి

MDK: చేగుంట మండలం జైత్రంతాండాలో విద్యుత్ సమస్యలు ఇబ్బందిగా తయారయ్యాయని సర్పంచ్ ధరావత్ సుభాష్ నాయక్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని గురువారం జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) నారాయణ నాయక్ ను కలిసినట్లు వివరించారు. తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.

March 5, 2026 / 07:50 PM IST