• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భూ సర్వేకు మోడల్ గ్రామాలుగా ఇవే

RR: భూ భారతి భూ సర్వే కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలంలోని నవలయపల్లి, అంతారం గ్రామాలను మోడల్‌ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్‌ కృష్ణయ్య తెలిపారు. నవలయపల్లిలో గ్రామసభ నిర్వహించి భూముల సరిహద్దులు, యాజమాన్య వివరాలను సర్వే చేసి డిజిటల్‌ రికార్డులుగా నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రామస్వామి, ఆర్‌ఐ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

March 7, 2026 / 07:46 PM IST

ఈనెల 8, 9న KUలో జాతీయ సదస్సులు

WGL: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలోని సినెట్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9, 10 తేదీల్లో జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు సంచాలకులు డాక్టర్ బీ. దీపా జ్యోతి తెలిపారు. “Literature, Leadership and Innovation: Women Shaping Viksit Bharat – 2047” అనే అంశాల పై ప్రముఖుల ప్రసంగాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు.

March 7, 2026 / 07:45 PM IST

బోడుప్పల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

MDCL: బోడుప్పల్ 10వ సర్కిల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శానిటేషన్ కార్మికులను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఈ.శ్యామ్ సుందర్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.జాహ్నవి శశాంక్ పాల్గొని నగర పరిశుభ్రతకు మహిళా కార్మికులు చేస్తున్న సేవలను అభినందించారు.

March 7, 2026 / 07:42 PM IST

‘రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశాలలో చేర్చాలి’

ASF: భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశాలలో చేర్చాలని జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రథయాత్ర శనివారం ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ని కలిసి మెమోరాండం అందజేశారు. భారత రాజ్యాంగం ప్రజలకు అర్ధం కావాలంటే చదువులలో ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు.

March 7, 2026 / 07:42 PM IST

పురుగుల అన్నం ఘటన.. హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు

KMR: భిక్కనూర్ (M) బాగిర్తిపల్లి ZPHSలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం, పథకం అమలులో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. శనివారం కామారెడ్డి ఆర్డీవో, భిక్కనూర్ ఎమ్మార్వో, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాఠశాలను సందర్శించి లోపాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు DEO రాజు తెలిపారు. తక్షణమే ఆ ఏజెన్సీని రద్దు చేస్తునట్లు తెలిపారు.

March 7, 2026 / 07:41 PM IST

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన SP

MBNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళలందరికీ ఎస్పీ జానకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలకు గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపిస్తూ దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆమె తెలిపారు.

March 7, 2026 / 07:40 PM IST

పాత కక్షతో హత్యాయత్నం: సీఐ

BDK: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఈనెల 4న నెహ్రూ బస్తీకి చెందిన నరేష్‌పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, ఉదయ్, రాజేశ్వరరావు రోకలిబండతో దాడి చేసినట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను కొత్తగూడెం-1 టౌన్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్థలం విషయంలో గొడవ జరిగినట్లు తెలిపారు.

March 7, 2026 / 07:39 PM IST

‘ద్రోహులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు’

MHBD: ద్రోహులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని తొర్రూరు మండల కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, సాయిమల్లు, గిరిధర్‌లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కాకిరాల హరిప్రసాద్, రామ సహాయం కిషోర్ రెడ్డిలు కారణమయ్యారని, పొంతనలేని ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

March 7, 2026 / 07:39 PM IST

జిల్లా ఆసుపత్రిలో మహిళా దినోత్సవం వేడుకలు

పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని సన్మానించారు. వారి చేత కేక్ కట్ చేయించారు. సమాజంలో మహిళల ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డా. విజయ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 7, 2026 / 07:35 PM IST

దేవరకొండ కోర్టులో ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్

NLG: రంజాన్ మాసం సందర్భంగా దేవరకొండ కోర్టులో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ కె.అనిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.స్నేహ పాల్గొని సిబ్బందితో కలిసి ఇఫ్తార్‌ను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరం, గాజుల ఆంజనేయులు, ఇతర కోర్టు సిబ్బంది ఉన్నారు.

March 7, 2026 / 07:35 PM IST

నిర్మాణ పనులను పరిశీలించిన ఛైర్మన్

JN: రఘునాథపల్లి మండలంలోని వెంకటాయపాలెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు, నేతలు పరిశీలించారు. వెంకటాయపాలెం గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరుతామని ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

March 7, 2026 / 07:34 PM IST

‘మహిళా రక్షణలో బీజేపీ ప్రభుత్వం విఫలం’

SRPT: బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, వారికి సరైన రక్షణ కరువైందని NFIW రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన ఆరోపించారు. సూర్యాపేటలో ఆమె మాట్లాడుతూ.. చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అమలులో జాప్యం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షీ టీమ్స్ సంఖ్యను పెంచాలని హైదరాబాద్‌లో జరిగే మహిళా దినోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

March 7, 2026 / 07:33 PM IST

ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

HYD: బౌద్ధనగర్‌లో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు పరమత సహనానికి, సోదరభావానికి ప్రతీకలని కొనియాడారు. రంజాన్ పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

March 7, 2026 / 07:32 PM IST

మహిళా సాధికారత మాటలకేపరిమితం: ఐద్వా

BHNG: అన్ని రంగాల్లో మహిళలను విస్మరిస్తున్నారని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంకేతికత పెరుగుతున్నా మహిళలను రెండో తరగతి పౌరులుగానే చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మహిళా సాధికారత అని ప్రగల్భాలు పలికే పార్టీలు, అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాయన్నారు.

March 7, 2026 / 07:30 PM IST

తంగళ్లపల్లిలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

SRCL: ఎమ్మెల్యే కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా తంగళ్లపల్లి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు సాధించాలని జగన్, కొడి అంతయ్య సూచించారు. విద్యార్థుల కోసం కేటీఆర్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని తెలిపారు.

March 7, 2026 / 07:28 PM IST