KMR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా KMR జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారికి చర్చి ఫాదర్ జోసఫ్ కీశోర్, శ్రీలత కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్ధనలతో ఛైర్ పర్సన్‌కు ఆశీర్వాదాలు అందచేశారు.
JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ బద్దం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని గ్రామంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపసర్పంచ్ గంగ పోచయ్య, వార్డు సభ్యులు, సంస్థ ప్రతినిధి, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.
ASF: పెంచికల్ పేట మండలంలోని కేజీబీవీ బాలికల నివాస పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు 150కి పైగా శానిటరీ నాప్కిన్‌లను సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్‌లు ఆదివారం పంపిణీ చేశారు. అలాగే 10వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు అందజేశారు. సీఐ మాట్లాడుతూ.. విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
VKB: బొంరాస్ పేట మండలం లింగ్యానాయక్ తండాలో సర్పంచ్ సోంమ్లా నాయక్ సేవాలాల్, మరియమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ హన్మ్యా నాయక్, ఢాక్యా నాయక్, తండావాసులు పాల్గొన్నారు.
WNP: ఏదుట్ల గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం గ్రామ సమావేశంలో క్రింది కమిటీ ఏర్పాటుచేయబడింది. అధ్యక్షుడిగా గుణగంటి శేఖర్, ఉపాధ్యక్షులుగా నల్లభోతుల రమేష్, మండ్ల శివకుమార్ లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి మండ్ల కుమార్, కోశాధికారి గోకారం సాయికుమార్, గౌరవ అధ్యక్షుడు సంకేండ్ల విష్ణు, కార్యదర్శులు చీకొండ్ర మల్లేష్, బోనమోని శివకుమార్, గుణగంటి రాముడు, తదితరులు పాల్గొన్నారు.
KNR: పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ హుజురాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సీపీఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
NRML: మహిళా దినోత్సవం వేళ నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సేవలు స్ఫూర్తిదాయకం. ఆమె ‘నిర్మల్ పోలీస్ మీ పోలీస్’, ‘సివంగి’, ‘నారీశక్తి’, ‘పోలీస్ అక్క’ లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దత్తత, మహిళా పోలీసుల ప్రోత్సాహంతో పాటు నిష్పక్షపాతంగా న్యాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఎస్పీ సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ADB: సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక బస్‌స్టాండ్‌లో సన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.
NZB: రాజ్యసభ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డిని కమ్మర్ పల్లి మండలంలోని పలువురు సర్పంచులు ఆదివారం కలిశారు. HYDలోని ఆయన నివాసంలో ఎంపీ సురేష్ రెడ్డిని హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, చౌట్ పల్లి సర్పంచ్ మహబూబ్ కలిసి గ్రామాల్లో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన ఎంపీ సురేష్ రూ.16 లక్షల నిధులను మంజూరు చేశారు.
MBNR: పట్టణ మేయర్ జి. మమతను బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి తొలి మేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా కొనియాడారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు.
BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మహిళా సోదరీమణులకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి వంటి ఎందరో మహిళలు తమ హక్కుల కోసం అసువులు బాసారని పేర్కొన్నారు.
NLG: పెంచిన వంటలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ అన్నారు. ఆదివారం నకిరేకల్ లో పెంచిన ధరలను నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం మోపుతుందని మండిపడ్డారు.
SDPT: రామక్కపేటలో శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ వేడుకలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
NGKL: కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పట్టణంలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం ఆయన పర్యటించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
NRPT: కోస్గి మున్సిపాలిటీలో 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ వేగంగా సాగుతోంది. ఆదివారం 10వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ నాగులపల్లి నరేందర్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పార్కుల వద్ద పేరుకుపోయిన చెత్తను, మురికిని స్వయంగా సిబ్బందితో కలిసి తొలగించారు. పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.