GDWL: ఇటిక్యాల రైల్వే స్టేషన్లో తుంగభద్ర ఎక్స్ప్రెస్ నిలపాలని కోరుతూ ఎంపీ డీకే అరుణకు గురువారం BJP శ్రేణులు, గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ హాల్టింగ్ ఎంతో అవసరమని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నేతలు కేకే రెడ్డి, జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.