• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించాలిక్’

HNK: గిరిజనులకు హామీల అమలుకై బడ్జెట్‌లో 25 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వీరన్ననాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. హనుమకొండలో వారు మాట్లాడుతూ… గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపై బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమన్నారు.

March 18, 2026 / 06:07 PM IST

వేల్పూరులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ బేల్దారు నవీన్ లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌తో పాటు జీపీవో సుధాకర్, పంచాయతీ సెక్రెటరీ రమేష్, వార్డు మెంబర్ గోవర్ధన్ పాల్గొన్నారు.

March 18, 2026 / 06:03 PM IST

ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ రూ.196 కోట్లు

KMM: ఖమ్మం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.196 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ అనుదీప్ వివరాలను వెల్లడించారు. నగరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి పౌర సేవలను మెరుగుపరచాలని నిర్ణయించారు.

March 18, 2026 / 06:03 PM IST

రాయితీ పథకాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

SRPT: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాల రాయితీ పథకాలను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. 60 నుంచి 90 శాతం రాయితీ ఉండే ఈ పథకాలకు ఈనెల 24 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అర్హులు తమ పత్రాలను కలెక్టరేట్‌లో సమర్పించాలని పేర్కొన్నారు.

March 18, 2026 / 06:02 PM IST

శ్రీనిధి రుణాల చెల్లింపులపై అధికారుల దృష్టి

MDK: చిలిపిచేడు మండలం అజ్జమరి గ్రామంలో డ్వాక్రా గ్రూపులకు చెందిన శ్రీనిధి రుణాల మొండి బకాయిల వసూళ్లను బుధవారం అధికారులు ప్రారంభించారు. ఏపీఎం గౌరీశంకర్, పురుషోత్తం, బ్యాంక్ మేనేజర్, సీసీలు, ఫీల్డ్ ఆఫీసర్లు గ్రామంలో మహిళలను కలిసి బకాయిలు చెల్లించాలని కోరారు. సమయానికి రుణాలు చెల్లించి గ్రూపుల బలోపేతానికి సహకరించాలని సూచించారు.

March 18, 2026 / 06:02 PM IST

బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

KNR: మీర్జంపేటకు చెందిన కేశవేణి సాగర్ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 23 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మాజీ ఎంపీటీసీ సదానందం గౌడ్ బుధవారం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల వైద్య భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆపదలో అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్ పేదలకు కొండంత ఆసరా అని పేర్కొన్నారు.

March 18, 2026 / 06:01 PM IST

తాగునీటి సమస్యలు రాకుండాచర్యలు: కలెక్టర్

MBNR: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ఏరియా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తాగునీరు పారిశుద్ధ్యం డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు.

March 18, 2026 / 06:01 PM IST

ఉగాది ఎఫెక్ట్..పెంచిన ఆర్టీసీ చార్జీలు

NGKL: ఉగాది పండగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు స్పెషల్ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ఛార్జీలు విపరీతంగా పెంచారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు రూ.140 ఉన్న ఛార్జిని రూ.200 వరకు పెంచారు. దీంతో మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చి పురుషులకు ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

March 18, 2026 / 06:01 PM IST

‘కాంగ్రెస్‌ మూసీని మురికికూపంగా మార్చింది’

HYD: మూసీ నదిని మురికికూపంగా మార్చిన చరిత్ర కాంగ్రెసేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధ్వజమెత్తారు. తాము మూసీ అభివృద్ధికి ఎన్నడూ వ్యతిరేకం కాదని కేవలం రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవాలనే కుట్రను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ భారీ కుంభకోణానికి తెరలేపడం సరికాదని ఈదోపిడీపై తమ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.

March 18, 2026 / 06:00 PM IST

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: SP

ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివసిస్తున్న హోంగార్డు లక్ష్మి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్ లక్ష్మీ ఇంటికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తక్షణ సహాయం కింద కుటుంబ సభ్యులకు రూ. 10 వేలు అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

March 18, 2026 / 06:00 PM IST

కొల్లాపూర్ పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

NGKL: కొల్లాపూర్ కొనసాగుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 100% పన్ను వసూలు చేయాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు.

March 18, 2026 / 06:00 PM IST

డివిజన్‌లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

MBNR: కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ క్రిస్టియన్ పల్లి ఆదర్శనగర్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పారిశుద్ధ్యం రోడ్లు వీధి బల్బుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకూడదని సిబ్బందిని ఆదేశించారు.

March 18, 2026 / 06:00 PM IST

‘ఫోటో క్యాప్చర్ విధానం రద్దు చేయాలి’

MDK: ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడవయ్య డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కేంద్రాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ఫోటో క్యాప్చర్ విధానం తీసుకువచ్చిందని ఆరోపించారు.

March 18, 2026 / 06:00 PM IST

రూల్స్ జాన్తా నై.. ఎగ్జామ్ హాల్లోకి ఫోన్లు..!

MDCL: పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణలో HYD, పెద్దపల్లి జిల్లాల్లోని 12% కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు బయోమెట్రిక్ హాజరు తర్వాత కూడా ఫోన్లను తమవద్దే ఉంచుకుంటున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం బయటకు వెళ్తాందన్న ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ నడుస్తోంది.

March 18, 2026 / 05:55 PM IST

రాజకీయాలు కంటే వివాదాలే ఎక్కువ..!

HYD: తాండూరు మాజీ MLA రోహిత్ రెడ్డి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. 2018 నుంచి డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల ఎర కేసు, పోలీసులతో గొడవలు వంటి అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీసులతో గొడవ పడి, వారంపాటు అజ్ఞాతంలో ఉండి బెయిల్ పొందారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం తాండూరు పోలీస్ స్టేషన్‌లో హాజరవుతున్నారు.

March 18, 2026 / 05:50 PM IST