MNCL: జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 9,685 మందికి గాను 9662 మంది, గతంలో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులకు ఒక్కరూ హాజరయ్యారు. మొత్తం 9688 మంది విద్యార్థులకు 9663 హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.
KMR: పాల్వంచ మండలం ఫరీద్ పేట్‌లో యూరియా కొరత సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ జీడిపల్లి నర్సింహా రెడ్డి ఇటీవల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై స్పందించిన షబ్బీర్ అలీ చర్యలు తీసుకుని బుధవారం గ్రామానికి 444 బస్తాల యూరియా బస్తాలను పంపిణీ చేయించారు. రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని వాటిని పొందవచ్చన్నారు.
SDPT: ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లిలో ప్రజలకు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నూతన గేట్వాల్ నిర్మాణం చేసినట్లు సర్పంచ్ బర్మా రాజమల్లయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసే గేట్వాల్ రిపేర్ కావడంతో దానిని తీసి వేయించి కొత్త గేట్వాల్ వేసినట్లు వెల్లడించారు. ప్రజలకు తాగునీరు ఎద్దడి లేకుండా చూడడమే లక్ష్యమని అన్నారు.
NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ అధిష్ఠానం తమిళనాడు ఎన్నికల ఇంఛార్జ్‌గా నియమించింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఆయన పనిచేయనున్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.
MDK: నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించారు. గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ విధంగా ఇంటి వద్దకే వైద్యం అందించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు0
నిర్మల్ జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలలో గురువారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఈవో భోజన్న తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9722 మంది విద్యార్థులకు గాను 9715 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రశాంతంగా పరీక్షను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 99.93 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
KMM: మధిర మున్సిపాలిటీలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా నిర్వహించారు.
MHBD: పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని DSP తిరుపతిరావు సూచించారు. బయ్యారంలో ఏర్పాటుచేసిన పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచనలు చేశారు.
NZB: జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాతో కలిసి ఆయిల్ పామ్ ఇండస్ట్రీ నెలకొల్పేందుకు అనువైన స్థలాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
KMR: బీర్కుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏ సెంటర్‌లో 147 మంది, బీ సెంటర్‌లో 146 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 100% మంది పరీక్షకు హాజరయ్యారు. ఫ్లైయింగ్ స్కాడ్ బృందం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసింది.
BDK: జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంతంలోని రేడియాలజీ హబ్ మెయిన్ గేటు ముందు చచ్చిన కుక్క కళేబరం దుర్వాసన వెదజల్లుతోందని నేడు రోగులు వెల్లడించారు. అటుగా వెళ్లే వాళ్లు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్స్ రే, స్కానింగ్ కోసం కేంద్రానికి వచ్చే పేషెంట్లకు కుళ్లిన కుక్క కళేబరం కంపుతో స్వాగతం పలుకుతోంది.
KNR: గంగాధర మండలం న్యాలకొండన్నపల్లి గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి దేవికి పూజ చేసి, ఉగాది పచ్చడిని పంచుకున్నారు. తెలుగు ఉగాది పండుగ విశిష్ఠత గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SRPT: జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలని ఈరోజు డీఎంహెచ్‌వో వెంకటరమణ ఆదేశించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ప్రాక్టీస్ చేయడం నేరమని స్పష్టం చేశారు. గడువు ముగిసిన సంస్థలు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని అన్నారు.
BHPL: యుద్ధం కారణంగా BHPL జిల్లా రేగొండ మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. వారం రోజుల క్రితం ఇండియన్ గ్లాస్ ఏజెన్సీలో బుక్ చేసిన సిలిండర్లు ఇప్పటివరకు డెలివరీ కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులను అడగగా.. స్టాక్ లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
WGL: స్వయంకృషి మహిళా సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు బుధవారం నిర్వహించిన మహిళ సాధికారత కార్యక్రమంలో ఛైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న “ఇందిరమ్మ మహిళా శక్తి” పథకం కింద వడ్డీ లేని రుణాల గురించి మహిళలకు వివరించారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు.