• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వృధాగా.. నీటి తొట్లు

NLG: పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్లు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లేక అవి నిరుపయోగంగా మారాయని జిల్లాలోని ఆయా గ్రామాల పశుపోషకులు తెలిపారు. కొన్నిచోట్ల పాక్షికంగా ధ్వంసం కాగా మరికొన్ని గ్రామాల్లో వ్యర్థాలతో నిండుతున్నాయన్నారు. వేసవి దృష్ట్యా అధికారులు వినియోగంలోకి తీసుకురావాలని పశుపోషకులు కోరుతున్నారు.

March 18, 2026 / 01:30 PM IST

మాజీ మంత్రిపై స్పందించిన శ్రీధర్ బాబు

KNR: మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంశంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ఆయన సీనియర్ నాయకుడని, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యం కోరలేదని తెలిపారు. స్థానిక సమస్యల కారణంగానే అసంతృప్తి నెలకొన్నట్టు పేర్కొన్నారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడి పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే తాను కూడా చర్చిస్తానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

March 18, 2026 / 01:30 PM IST

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

JN: పాలకుర్తి మండల వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, తాగునీరు, వైద్యం, విద్యుత్ తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:30 PM IST

నూతన SIను సన్మానించిన BRS యూత్ నాయకులు

BHPL: రేగొండ మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుధాకర్‌ను ఇవాళ  BRS యూత్ టౌన్ అధ్యక్షులు మాడగాని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో యువ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పసుల రాజు, తడుక శ్రీకాంత్, కొడెపాక అర్జున్, కందకట్ల రాజు, పొడేటి శివ, పూజారి నాగరాజు, గండి నరేష్ ఉన్నారు.

March 18, 2026 / 01:22 PM IST

మండలంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

VKB: గోవిందపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. మంగళవారం మోమిన్ పేట మండల పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ గొల్ల కృష్ణవేణి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. దశల వారిగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

March 18, 2026 / 01:22 PM IST

నీటి సమస్యపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న నీటి సమస్యలపై మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి బుధవారం ముడా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని అన్నారు. అన్ని డివిజన్లకు అంతరాయం లేకుండా నీటి సరఫరా జరగాలని అధికారులను ఆదేశించారు.

March 18, 2026 / 01:20 PM IST

అనంతసాగర్ పాఠశాలలో బాలకవి సమ్మేళనం

SDPT: తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నకోడూరు మండలం అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో బాలకవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 20 మంది విద్యార్థులు పాల్గొని తమ కవితలు వినిపించారు. అరవై సంవత్సరాల పేర్లు విద్యార్థులు చదివి వినిపించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులు పర్షరాములు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:18 PM IST

కమిషనరేట్ పరిధిలో నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు. 12 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 18, 2026 / 01:16 PM IST

గుండెపోటుతో మాజీ సీపీఎం నాయకుడు మృతి

MHBD జిల్లా వ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఈరోజు ఉదయం మాజీ సీపీఎం నాయకుడు కుర్ర మహేష్ హార్ట్ అటాక్‌తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు అమలుకున్నాయి. మహేష్ మృతిపట్ల జిల్లా పరిధిలోని నాయకులు, ప్రజలు సంతాపం తెలుపుతున్నారు.

March 18, 2026 / 01:16 PM IST

తై బజార్ వేలంలో రూ. 43.35 లక్షల ఆదాయం

MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో తై బజార్ వేలంపాటలో రూ. 43.35 లక్షల ఆదాయం సమకూరింది. కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వేలంపాటలు నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన నాగరాజు వేలం పాటల్లో తై బజార్ దక్కించుకున్నారు. గత ఏడాది కంటే రూ. 7.35 లక్షల ఆదాయం అధికంగా సమకూరిందని తెలిపారు.

March 18, 2026 / 01:15 PM IST

ఉచిత మెగా పశువైద్య శిబిరం

BHNG: తుర్కలషాపురంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 284 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసి, 48 పశువులకు గర్భకోశ వ్యాధి పరీక్షలు చేసి మందులు అందజేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ యాకుబ్ మాట్లాడుతూ.. రైతులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 18, 2026 / 01:15 PM IST

పాత పద్ధతిలోని ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి: సీఐటీయూ

NLG: పాత పద్ధతిలోని ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని CITU జిల్లా కార్యదర్శి సలీం డిమాండ్ చేశారు. మండలంలోని దుప్పలపల్లిలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను ఇవాళ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘VB రాంజీని’ రద్దుచేసి ‘MG జాతీయ ఉపాధి హామీ పథకాన్ని’ కొనసాగించాలని కనీస వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు.

March 18, 2026 / 01:11 PM IST

నార్నూరులో పర్యటించిన పోలీస్ ఈగల్ టీం

ADB: నార్నూర్ మండలంలోని నాగల్కొండ గ్రామంలో బుధవారం ‘పోలీస్ ఈగల్ టీం’ పర్యటించింది. ఈ సందర్బంగా మత్తు పదార్థాల నియంత్రణపై ఎస్సై శ్రీసాయి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, గుట్కా, మద్యం వంటి పదార్థాలను పూర్తిగా నిషేదించాలని సూచించారు. గంజాయి విక్రయించినా, తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:11 PM IST

రేపు వాసవీమాత ఆలయంలో ఉగాది పూజలు

GDWL: రేపు ఉగాది పండుగను పురస్కరించుకుని శాంతినగర్ లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకుడు వినయ్ కౌశల్ తెలిపారు. వేకువజామున అమ్మవారికి అభిషేకం, అర్చన, మహా మంగళహారతితో పాటు పంచాంగ శ్రవణం, గోమాత పూజ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 18, 2026 / 01:10 PM IST

కొండాపురంలో రంజాన్ తోఫా పంపిణీ

BHNG: జిల్లాలోని తుర్కపల్లి మండలం కొండాపురంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు తోఫా పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప సర్పంచ్ జహంగీర్, వార్డ్ సభ్యులు స్వప్న, మధు, రవికిరణ్, పాండు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:10 PM IST