• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శ్రీరామనవమికి కేసీఆర్‌కు ఆహ్వానం

SDPT: సిద్దిపేట మండలం చింతమడకలోని సీతారామచంద్రస్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, శ్రీరామనవమి వేడుకలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25, 27 తేదీల్లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 21, 2026 / 04:49 AM IST

కేజీబీవీ దరఖాస్తులు.. ఏప్రిల్ 15 వరకు ఛాన్స్

SRD: ఆందోల్ కేజీబీవీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశపరీక్ష కోసం ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని జీసీడీవో సునీత శుక్రవారం తెలిపారు. పదో తరగతి చదువుతున్న బాలికలు www.tgrjc.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 3న ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 21, 2026 / 04:38 AM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ వైద్య శిబిరం

NGKL: ఉప్పునుంతలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రగతి ప్రణాళిక ఆరోగ్య మిషన్-99 రోజులు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారీ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఆరుగురు స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా మాతా-శిశు సంరక్షణ, కిషోర బాలికల ఆరోగ్యం, వయోవృద్ధుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

March 21, 2026 / 04:24 AM IST

మే 19న ఎస్టీ గురుకుల COE ప్రవేశ పరీక్ష

NRPT: ఎస్టీ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ విద్యార్థులు మే 19న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtwreis.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల...

March 21, 2026 / 04:21 AM IST

పాలమూరు వర్సిటీకి రూ.20 కోట్ల బడ్జెట్

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించడంపై వీసీ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో రూ.13 కోట్లు ఉండగా, ఈసారి అదనంగా రూ.7 కోట్లు పెంచడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ‘పీఎం ఉషా’ పథకం ద్వారా వచ్చిన రూ.100 కోట్లతో వర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

March 21, 2026 / 04:16 AM IST

‘టీచర్ల జీపీఎఫ్ బిల్లుల పరిష్కారానికి వినతి’

SRD: ఉపాధ్యాయుల జీపీఎఫ్ బిల్లుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్నకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆమె.. ప్రస్తుతం ముగ్గురు అధికారులతో ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు 60 బిల్లులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

March 21, 2026 / 03:37 AM IST

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు’

GDWL: రాజోలిలోని ఆర్డీటీ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దస్తగిరి శుక్రవారం పరిశీలించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తే బిల్లులు అంతే త్వరగా వస్తాయని, పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

March 21, 2026 / 03:27 AM IST

రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన కౌన్సిలర్

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలను స్థానిక కౌన్సిలర్ అప్పం కిషన్ పంపిణీ చేశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దాతృత్వం వంటి మహత్తర విలువలను పెంపొందించే పవిత్ర కాలమన్నారు. రంజాన్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.

March 20, 2026 / 10:12 PM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

JN:స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ముస్లిం సోద‌ర‌,సోద‌రీమ‌ణుల‌కు రేపు రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్ష‌లు, ప్రేమ‌, ద‌య,సౌభ్రాతృత్వ గుణాల‌ను పంచుతుంద‌ని పేర్కొన్నారు.

March 20, 2026 / 09:50 PM IST

పంచాంగం పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ

MHBD: ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగంని ఎస్పీ డా.శబరీష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ గాడిపల్లి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, తదితరులున్నారు.

March 20, 2026 / 09:47 PM IST

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయించాలని కలెక్టర్ కు వినతి

MLG: జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌తో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయం కోసం భూమి కేటాయించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో కార్యాలయం లేక కార్యకలాపాలకు ఇబ్బంది అవుతున్నదని, రెండు ఎకరాల భూమి కేటాయించాలని వినతిపత్రంలో కోరారు.

March 20, 2026 / 09:35 PM IST

‘రైతు మహోత్సవ కార్యక్రమానికి రైతులు తరలి రావాలి’

SDPT: కోహెడ మండల రైతుల కోసం ఈ నెల 21వ తేదీన రైతు మహోత్సవ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శన, సుమారు 150 ప్రదర్శన స్టాళ్ల వీక్షణ, రైతులు, శాస్త్రవేత్తలతో చర్చా గోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్నారు.

March 20, 2026 / 09:33 PM IST

రైతులకు గమనిక… రెండు రోజులు మార్కెట్ బంద్

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు (శనివారం) రంజాన్, వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచించారు.

March 20, 2026 / 09:30 PM IST

రాజ్యాంగ స్థూపానికి స్థలం కేటాయించాలని వినతి

NGKL: చారకొండ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ స్తూప నిర్మాణానికి స్థలం కేటాయించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు శుక్రవారం సర్పంచ్ విజేందర్ గౌడ్‌‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన సర్పంచ్, స్తూప నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మల్లేశ్, వెంకటయ్య గౌడ్, మల్లికార్జున పాల్గొన్నారు.

March 20, 2026 / 09:21 PM IST

తెలుగు వర్శిటీ.. నేడు ఘనంగా ఉగాది ఉత్సవాలు

HYD: సురవరం ప్రతాపరెడ్డి HYD తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో దక్షిణ మండల సాంస్కృతిక కేంద్రం, భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస ఫణీంద్ర ‘శ్రీ పరాభవ నామ సంవత్సరం’ పంచాంగాన్ని సభలో ప్రవచించారు. ఈ కార్యక్రమంలో వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు పాల్గొన్నారు.

March 20, 2026 / 09:14 PM IST