BHPL: TGలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో 22 లక్షల మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని TRP మొగుళ్లపల్లి (M) అధ్యక్షులు రాజేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని, ఫీజు ఒత్తిడితో ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలన్నారు.
JN: జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు, ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి MLA హరీష్ రావు, తొలి ఉపముఖ్యమంత్రి రాజయ్య ఇన్నయ్య నివాసానికి వెళ్లి ఆయన తండ్రి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ADB: విద్యార్థులు శాస్త్రీయంగా రాణించాలని ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ అన్నారు. సర్. సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర సాంకేతిక కృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కృష్ణకుమార్ పేర్కొన్నారు.
KMR: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం పిట్లం మండలంలో పర్యటించారు. మండలంలోని బుర్నాపూర్ గ్రామానికి వెళ్తున్న క్రమంలో పిట్లం చేరుకున్న ఆయనకు జిల్లా అధికార యంత్రాంగం స్వాగతం పలికింది. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.
MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ పై వివాదం చిరరేగింది. అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 7 రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా, ఒక రోజు ముందు వాట్సాప్, మైకు ద్వారా సమాచారం ఇచ్చారని యువత ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు గ్రామసభ దగ్గరికి వెళ్లగా.. పాలకవర్గం లోపలే మీటింగ్ పెట్టుకుని సభ వాయిదా వేసిందని విమర్శించారు.
RR: చేవెళ్ల మున్సిపల్ నూతన ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డిలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎర్ర గోపాల్ యాదవ్, నరేందర్ రెడ్డి శాలువతో సన్మానించారు. మునిసిపల్ అభిరుద్దికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, టేకులపల్లి శ్రీనివాస్, యాదవ్, అశోక్, నరేష్, ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.
KNR: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ట్రాన్స్ కో ఆధ్వర్యంలో విద్యుత్ ప్రజాబాట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రజలకు ఏమైనా విద్యుత్ సమస్య లుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వైర్లు తెగితే సిబ్బందితో రిపేర్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివాకర్ రావు, సబ్ ఇంజనీర్ నవీన్, సర్పంచ్ ముదాం రవి, ట్రాన్స్ కో సిబ్బంది పాల్గొన్నారు.
KMM: కల్లూరు మున్సిపాలిటీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అధికారులను సూచించారు. శనివారం కల్లూరులో పర్యటించిన ఛైర్మన్ డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని భద్రకాళీ బండ్ వద్ద మరికొద్ది సేపట్లో ‘రుద్రమ-1’ మోడల్ రాకెట్‌ను ప్రయోగించనున్న విషయం తెలిసిందే. 250 గ్రాముల బరువు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఈ చిన్న రాకెట్ శాస్త్ర సాంకేతిక రంగంలో ఆసక్తి ఉన్నవారిని ఆకర్షిస్తుందని నిర్వాహకులు తెలిపారు. రాకెట్ ప్రయోగం సమయంలో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
BHNG: ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఎన్‌ఆర్‌జీఎస్ నిధుల కింద రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి దిశగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపదుతుందన్నారు.
WNP: జిల్లా పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, ప్రజా సేవలకు ప్రతీకగా నిలిచిన పెబ్బేరు ఏఎస్సై బాలస్వామి సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో బాలస్వామి వేడుకలు కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా ఉండాలన్నారు.
SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 20 కుంటల (అర ఎకరం) భూమిని శనివారం రెవెన్యూ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు పరిశీలించి అప్పగించారు. రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ స్థలం మంజూరైందని మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ సైసా తెలిపారు.
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తదితరులకు ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈవో రంగాచారి, వేద పండితులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
PDPL: ధర్మారం తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు తయారుచేసి ఎగ్జిబిట్ చేశారు. అలాగే సైన్స్ క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు. సైన్స్ పోటీల వల్ల విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందుతుందని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: జహీరాబాద్ అమ్మకు మించిన దైవం లేదని, తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యమని మహామండలేశ్వర్ శ్రీ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. యువత మంచి మార్గంలో నడుస్తూ పెద్దలు చూపిన దారిలో సాగాలన్నారు. కుటుంబ విలువలను కాపాడితే సమాజం సుభిక్షంగా ఉంటుందని సూచించారు.