• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సులో ప్రవేశాలు

KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల 2025-26 సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అభ్యర్థులు మార్చి 10లోగా తెలుగు విభాగంలో దరఖాస్తులు సమర్పించాలి అని ప్రిన్సిపాల్ కే. రామకృష్ణ, కోర్సు సమన్వయకర్త డా. బూర్ల చంద్రశేఖర్ సూచించారు. మరిన్ని వివరాలకు తెలుగు విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

March 2, 2026 / 04:36 PM IST

బాలల హక్కులపై గ్రామ సభలో అవగాహన

NRPT: ఉట్కూర్ మండలం మల్లేపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా శిశు సంక్షేమ శాఖ కౌన్సిలర్ విజయ్ కుమార్ పాల్గొని బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో, విద్యా హక్కు చట్టం వంటి కీలక అంశాలను వివరించారు. బాల్య వివాహాల సమాచారాన్ని వెంటనే 1098 నంబర్‌కు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కథలప్ప, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:35 PM IST

మాజీ స్పీకర్‌ శ్రీపాదరావుకు నివాళులు

PDPL: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ పాల్గొన్నారు.

March 2, 2026 / 04:34 PM IST

‘అర్జీలను వెంటనే పరిష్కరించాలి’

NRPT: ప్రజావాణిలో అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

March 2, 2026 / 04:34 PM IST

నార్సింగి ఎంపీడీవో బదిలీ

MDK: నార్సింగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) ప్రీతి రెడ్డి బదిలీ అయ్యారు. గత ఐదు నెలలుగా ఇక్కడ సేవలందించిన ఆమెను మనోరాబాద్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. నార్సింగి మండలంలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

March 2, 2026 / 04:34 PM IST

దర్గా పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: MLA

HNK: కాజీపేట దర్గా పరిసర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దర్గా రైల్వే గేట్ నుంచి కడిపికొండ వరకు రోడ్డు నిర్మాణ పనులకు ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ పనులను సుగుమం చేశామని చెప్పారు.

March 2, 2026 / 04:34 PM IST

65 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

NLG: పెద్దవూర మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ చెక్కులను అందజేశారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 2, 2026 / 04:33 PM IST

కోమటిపల్లి వాగుపై నూతన బ్రిడ్జి సర్వే

MLG: మంగపేట మండల కేంద్రంలోని కోమటిపల్లి గ్రామం నుంచి నర్సాయిగూడెం గ్రామానికి వెళ్లే మార్గంలోని కోమటిపల్లి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో బ్రిడ్జి నిర్మాణం అవసరమైంది. సర్వే తర్వాత ఎస్టిమేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

March 2, 2026 / 04:32 PM IST

జాతీయస్థాయి క్రీడాకారునికి సన్మానం

SRCL: వేములవాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలలో ఉత్తమ ప్రతిభను చాటుకొని జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎన్నికైన చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన సర్దని రాజేశం-పద్మ దంపతుల కుమారుడు వేణును సోమవారం శాలువాతో సన్మానించారు. తమ ఎంపీపీ పదవి కాలంలో ఎంతోమంది యువకులకు, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో ప్రోత్సహించారు.

March 2, 2026 / 04:32 PM IST

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: MLA

ADB: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. సోమవారం జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు.

March 2, 2026 / 04:32 PM IST

తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్: MLA

ASF: వాంకిడి మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు సోమవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను MLA కోవ లక్ష్మి పంపిణీ చేశారు. మొత్తం 16మందికి చెక్కులు అందజేసినట్లు తెలిపారు. MLA మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సర్పంచ్ చూనార్కర్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:32 PM IST

మాజీ CM KCRను కలిసిన.. తాటికొండ రాజయ్య

JN: స్టేషన్ ఘన్‌పూర్ మాజీ MLA, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్. తాటికొండ రాజయ్య జన్మదిన సందర్భంగా సోమవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ CM KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా KCR, రాజయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

March 2, 2026 / 04:32 PM IST

‘గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలి’

MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని విశ్వహిందూ పరిషత్ గో వంశ రక్షణ సంవర్ధన సమితి రాష్ట్ర సంపర్క ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి కోరారు. లక్షిట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో రెండు మండలాల సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం రెండు మండలాల గోరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ నగర అధ్యక్షులు రమేష్ ఉన్నారు.

March 2, 2026 / 04:31 PM IST

బేగంపేట టీటీఐలో 110 మందికి అవగహన

HYD: బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పార్కులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా నిబంధనలు ఉల్లంఘించే వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రంక్ & డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఈ సదస్సుకు హాజరయ్యారు.

March 2, 2026 / 04:30 PM IST

జనగామ కలెక్టర్‌తో ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి భేటీ

JN: జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. జనగామ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

March 2, 2026 / 04:29 PM IST