• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

12వ వార్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్ బిగింపు

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఏర్పాటు చేయించారు. వార్డులో విద్యుత్ సమస్య లేకుండా ఉండేందుకు నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించినట్లు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి.అరిఫ్ తెలిపారు.

March 1, 2026 / 01:25 PM IST

జిల్లా వ్యాప్తంగా ’30 పోలీస్ యాక్ట్’ అమలు

MBNR: శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

March 1, 2026 / 01:23 PM IST

ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఎన్నిక

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శివప్రసాద్, చెన్నయ్య, అధ్యక్షులుగా కృష్ణయ్య, రాములు, ప్రధాన కార్యదర్శిగా ముకుంద రెడ్డి, రాజేష్, అయ్యప్ప, కోశాధికారిగా హరిప్రసాద్‌తో పాటు సంయుక్త కార్యదర్శి సలహాదారులుగా పలువురిని ఎన్నుకున్నారు.

March 1, 2026 / 01:23 PM IST

రోడ్డుపై చెత్త కుప్పలు.. వాహనదారుల అవస్థలు

GDWL: గద్వాల పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్ పంప్ పక్కన రహదారి చెత్తాచెదారంతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్రమైన దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా రోడ్డుపైనే చెత్త పారేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, ఆ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 01:22 PM IST

కాంగ్రెస్ గెలుపును తట్టుకోలేక… విషం చిమ్ముతున్న గత పాలకులు

BDK: భద్రాచలం నియోజకవర్గం లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల సన్మాన సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలు అయిన, మున్సిపల్ ఎన్నికలు అయిన వార్ వన్ సైడ్ గానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ఇది జీర్ణించుకోలేని గత పాలకులు విషాన్ని చిమ్ముతున్నారన్నారు.

March 1, 2026 / 01:19 PM IST

సీతాఫల్ మండీలో మహనీయుల విగ్రహాల ఏర్పాటు

HYD: బీఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు నిరంతరం అనుసరించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. వారి జ్ఞాపకార్థం వారి సేవలను స్మరించుకుంటూ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం క్షేత్రస్థాయిలో పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో అందమైన కూడలిగా సీతాఫల్ మండీ రూపుదిద్దుకోనుందని తెలిపారు.

March 1, 2026 / 01:19 PM IST

లక్ష్మణ్ హత్య కేసులో దర్యాప్తు వేగం

BDK: కరకగూడెం మండలం, అశ్వాపురపాడు గ్రామంలో జరిగిన కోవాసి లక్ష్మణ్ హత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించగా, గ్రామస్థుల వాంగ్మూలాలు నమోదు చేశారు. కేసు వెనుక ఉన్న అసలు కారణాలను బయటకు తీయడానికి ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగుతోంది.

March 1, 2026 / 01:08 PM IST

పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దివంగత నాయకుడు పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

March 1, 2026 / 01:06 PM IST

నియమాలు పాటిస్తే.. పోలీసుల ప్రశంసలు

ADB: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వాహనదారులను పోలీసులు అభినందించారు. బోథ్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను, సీట్ బెల్ట్ ధరించిన కారు డ్రైవర్లను ఆపి వారికి పువ్వులు అందజేసి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.

March 1, 2026 / 01:05 PM IST

షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంప్లాయిస్ జేఏసీ

NZB: ఇటీవల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడంతో ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీకి ఎంప్లాయిస్ జేఏసీ ఛైర్మన్ సుమన్ కుమార్ ధన్య వాదాలు తెలిపారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్‌తో పాటు నేతికుంట శేఖర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 01:04 PM IST

హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో మంత్రి పొంగులేటి

KMM: ములుగులోని హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తన సతీమణి మాధురితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం గర్భాలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.

March 1, 2026 / 01:04 PM IST

అధ్వానంగా కొత్త బ్రిడ్జి రోడ్డు .. !!

NLG: త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ప్రయాణం నరకప్రాయంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి చదును చేసి వదిలివేయడంతో రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

March 1, 2026 / 01:01 PM IST

సూర్యాపేట బాల్ భవన్ విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతిభ

SRPT: విజయవాడలో జరిగిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో సూర్యాపేట బాల్ భవన్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. యండి షగుఫ్తకు ఆల్ ఇండియా డ్రాయింగ్ అవార్డ్, పలువురికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కాయి. గురువు దాసరి యల్లయ్య సన్మానింపబడ్డారు. బాల్ భవన్‌లో సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.

March 1, 2026 / 01:01 PM IST

మాసానిపల్లిలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

KMR: ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు మాసానిపల్లిలో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ సునంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సావిత్రి, యేచవ్వలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.

March 1, 2026 / 01:01 PM IST

పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని వార్డుల్లో ఛైర్మన్ నాగేష్ శెట్కార్, సంబంధిత కౌన్సిలర్లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రతి వార్డులో రోడ్లు దుస్థితి, మురికి కాలువల సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ లోపాలను ఆయన పరిశీలించారు. వీటన్నింటికి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంయుక్త అధికారులకు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

March 1, 2026 / 12:59 PM IST