BRS MLC’s : తమ పదవులకు రాజీనామా చేసిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే.
BRS MLC’s : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా ఏదైనా పదవికి రాజీనామా చేయాలి. ఆరు నెలల్లో ఆ ఖాళీ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలు సమర్పిస్తూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖలు పంపారు. ఇంతలో ఆయన వారి రాజీనామాలను ఆమోదించారు.
ఇదిలాఉంటే.. 2021లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందారు. వారి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. మరోవైపు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2015, 2021లో ఎమ్మెల్సీగా రెండు మార్లు గెలుపొందారు. ఆయన పదవీకాలం కూడా 2027 వరకు ఉంది. ఇప్పుడు వీరు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.