»Minister Seethakka Gave Counter To Harish Rao On Rythu Bandhu Scheme Telugu News
Rythu Bandhu : రైతు బంధుపై హరీశ్ రావు కౌంటర్.. సీతక్క ఎన్ కౌంటర్
రైతుబంధు నిధులపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం వైపే చూస్తున్నారు..
Rythu Bandhu : రైతుబంధు నిధులపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం వైపే చూస్తున్నారు.. రైతులకు బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. వడ్లకు ఎప్పుడు రూ.500 బోనస్ ఇస్తారు? వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు? చెప్పాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రైతుబంధు పెంచుతామని చెప్పారు.. పెంచిన రైతుబంధు ఎప్పటి నుంచి ఖాతాల్లో వేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై సీతక్క స్పందించారు.
ఆమె మాట్లాడుతూ.. పెద్ద పెద్ద ఫామ్ హౌసులున్న రైతులకు రైతు బంధు పడలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు బాధపడుతున్నారని సెటైర్లు వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నియమావళిని ఇష్టానుసారంగా పెట్టుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తరువాత తెలంగాణ రైతులకు రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ శాఖ అప్పుల కుప్పగా తయారైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోవద్దన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులే అవుతున్న విషయాన్ని ప్రతిపక్ష నేతలకు గుర్తు చేశారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమల్లోకి తెచ్చిన ఘనత రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మంత్రి సీతక్క తెలిపారు. మిగిలిన వాటిని త్వరలోనే నెరవేరుస్తామన్నారు.