»Troubled In Those Scenes With Emraan Tanushree Dutta
Emraanతో ఆ సీన్లలో ఇబ్బంది పడ్డ: తనుశ్రీ దత్తా
బాలీవుడ్ కిస్సర్ ఇమ్రాన్ హస్మితో కలిసి ముద్దుసీన్లలో నటించే సమయంలో ఇబ్బంది పడ్డానని తను శ్రీ దత్తా పేర్కొన్నారు. తనను టీమ్ సపోర్ట్ చేశారని.. అందుకే నటించగలిగానని వివరించారు.
Troubled in those scenes with Emraan: Tanushree Dutta
Tanushree Dutta: మూవీస్‌లో బోల్డ్ సీన్లలో యాక్ట్ చేసే సమయంలో హీరోయిన్స్ ఇప్పుడు కాస్తా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తున్నారు. ఆ సీన్లలో నటించే సమయంలో ముందే ప్రిపేర్ అవుతున్నారు. అదే ఓ 18 ఏళ్ల క్రితం అయితే.. ఇబ్బందే… బాలీవుడ్లో కిస్సర్ బాయ్ ఇమేజ్ ఉండే ఇమ్రాన్ హస్మితో కలిసి నటించడం అంటే సవాలే.. ఆ సమయంలో తెగ ఇబ్బంది పడ్డానని నటి తను శ్రీ దత్తా (Tanushree Dutta) తెలిపారు.
2005లో ఆషిక్ బనాయా ఆప్నే మూవీలో ఇమ్రాన్‌తో కలిసి తనుశ్రీ (Tanushree) నటించారు. అందులో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. కిస్ సీన్ షూట్ చేసే సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని వివరించారు. ఇమ్రాన్‌ను నటుడిగా అప్పుడే చూశా.. ఆయనతో పరిచయం లేదు. కిస్ సీన్ అనగానే కంగారుగా అనిపించింది. టీమ్ సపోర్ట్ చేయడంతో నటించగలిగానని తెలిపారు.
ఆ తర్వాత చాక్లెట్ మూవీలో ఇద్దరిపై కిస్ సీన్స్ ఉన్నాయి. ఎడిటింగ్ సమయంలో తీసేశారని చెప్పారు. ఇమ్రాన్ అంటే కిస్సర్ బాయ్ ఇమేజీ ఉండేది.. కానీ ఆ సీన్లలో యాక్ట్ చేసేందుకు ఇమ్రాన్ ఇబ్బంది పడేవారని తను శ్రీ (Tanushree) చెప్పారు. 2003లో తనుశ్రీ ఫెమినా మిస్ ఇండియా కిరీటం గెలిచింది. తర్వాత మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు. 2005లో సినీరంగ ప్రవేశం చేశారు. ఎనిమిదేళ్లు బాలీవుడ్ మూవీస్‌లో నటించారు. వీరభద్ర అనే తెలుగు సినిమాలో నటించి మెప్పించారు. కెరీర్ తొలి నాళ్లలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.