పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఓజి ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దానికి కారణం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ విలన్ అనే చెప్పాలి. ఓజిపై విలన్‌గా నటిస్తున్న బాలావుడ్ హీరో(emraan hashmi) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో.. సాహో డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజిపై భారీ అంచనాలున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ముంబైలో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఇమ్రాన్. పవన్, ఇమ్రాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హైలెట్ ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఓ డై హార్డ్ ఫ్యాన్‌గా పవన్‌ను ఎలా చూపించాలో.. అంతకుమించి అనేలా చూపించబోతున్నాడు సుజీత్. అందుకు తగ్గట్టే డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చే అప్డేట్స్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. దీంతో ఓజిపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇమ్రాన్ హాష్మి(emraan hashmi) ఓజీ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమాలో విలన్‌గా నటించాడు ఇమ్రాన్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓజీ(OG) గురించి స్పందించాడు. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో నటిస్తున్నానని, సినిమా స్టోరీ, పవన్ క్యారెక్టర్ అద్బుతంగా ఉంటుందని అన్నాడు. అలాగే.. పవన్ కళ్యాణ్ కూల్ యాస్, బ్యాడ్ యాస్.. అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ హష్మీ. అలాగే.. నవంబర్ 20న హీరోయిన్ ప్రియాంక బర్త్ డే కావడంతో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఓజీ.