యానిమల్ మూవీలో నటనకు గానూ తృప్తి డిమ్రికి నేషనల్ క్రష్ ఇమేజ్ వచ్చింది. కానీ తల్లిదండ్రులను మాత్రం దూరం చేసింది. ఆ మూవీలో కొన్ని సీన్లను చూసి.. ఇవి నువ్వే చేశావా..? గతంలో ఎవరూ ఇలా చేయలేదు కదా అని ప్రశ్నించారట.
Animal: ఇటీవల విడుదలైన యానిమల్ (Animal) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమాలో రణబీర్ హీరోగా నటించగా, రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి డిమ్రికి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ మూవీ తర్వాత నేషనల్ క్రష్‌గా మారింది. యానిమల్ సినిమా తర్వాత అందరి చూపు తృప్తి డిమ్రి సెక్సీ లుక్స్ పై ఉన్నాయి. ఆ మూవీ తర్వాత ఎక్కడ చూసినా తృప్తి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఐదారు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇప్పటికే అడల్ట్ సర్టిఫికేట్ పొందిన సినిమాలో కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలను కత్తిరించినప్పటికీ, ఇంకా చాలానే ఉన్నాయి. మూవీని ప్రేక్షకులు చాలా ఎక్కువగా స్వీకరించారు.
2017లో శ్రీదేవి నటించిన మామ్‌లో చిన్న పాత్రలో కనిపించిన తృప్తి డిమ్రి ఇప్పుడు రణబీర్ కపూర్‌తో నగ్నంగా కొన్ని సీన్స్ చేసింది. తృప్తి డిమ్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్‌తో యానిమల్ చిత్రంలో సన్నివేశాలను చూసిన తర్వాత తన తల్లిదండ్రుల స్పందనను తెలిపింది. ఆ సీన్స్ తల్లిదండ్రులను దూరం చేశాయని తృప్తి డిమ్రి పేర్కొంది.
ఆ సీన్లో నన్ను కూతురిని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇలాంటివి మనం సినిమాల్లో ఎప్పుడూ చూడలేదు. నువ్వు చేశావు’. ఆ సీన్ నేనే చేశానని వాళ్లకు అర్థం కావడానికి చాలా సమయం పట్టింది’ అని తృప్తి తెలిపింది. “నేను ఏ తప్పు చేయడం లేదని వారికి చెప్పాను, ఇది నా పని.. ఎలాంటి సమస్య అనిపించడం లేదు. నటిని, కాబట్టి 100 శాతం నిజాయితీగా ఉండాలి. తాను పోషిస్తున్న పాత్రల గురించి’’ అని తృప్తి డిమ్రి అన్నారు.