పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సలార్, కల్కితోపాటు మారుతి సినిమా కూడా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లనుంది. సెప్టెంబర్ 28న సలార్, నెక్స్ట్ సమ్మర్లో కల్కి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాంటి ప్రభాస్ కల్కి మేకర్స్‌కు చిరాకు తెప్పిస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
Shocking.. Is Prabhas troubling the makers of 'Kalki'?
Prabhas: చాలా కాలం ఊరించి ఎట్టకేలకు ప్రాజెక్ట్ కె అంటే ‘కల్కి 2898’ అని.. హాలీవుడ్ గడ్డపై రివీల్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్. టైటిల్‌తోపాటు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ ‘కల్కి’పై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఊహించని స్థాయిలో హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని ఫస్ట్ గ్లిమ్స్‌తో చెప్పేశారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబచ్చన్, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక లోకనాయకుడు కమలహాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టుగా వినిపిస్తునే ఉంది. దీంతో ఈ స్టార్ క్యాస్టింగ్ సినిమా పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నాయి.
ఇప్పటికే కల్కి షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇంకొన్ని రోజులు షూట్ చేస్తే కల్కికి ప్యాకప్ చెప్పెయొచ్చు. కానీ ప్రభాస్, దీపిక పదుకొనే డేట్స్ అడ్జెస్ట్ అవడం లేదట. అందుకే షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అవడం లేదని తెలుస్తోంది. రీసెంట్గా మూడు రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. కానీ తీరా అంతా పూర్తయ్యాక ప్రభాస్ షూటింగ్‌కు రాలేనని చెప్పాడట. ‘సారీ నాగీ ఈసారికి రాలేను’ అంటూ చివరి క్షణంలో చెప్పేశాడట. దీంతో ఈ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఇప్పటి వరకు ప్రభాస్ గురించి ఇలాంటి వార్తలు పెద్దగా వినిపించలేదు. లేకుంటే ఒకేసారి ఇన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను ప్రభాస్ హ్యాండిల్ చేసేవాడు కాదని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. కల్కి మేకర్స్ మాత్రం ప్రభాస్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.