Nagababu: కొడుకు సినిమా ఉండగా.. మరో హీరో సినిమా చూడమంటూ..
ఈ వారం తెలుగులో ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరో కార్తికేయ ఇద్దరు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇద్దరికీ ఈ వారం ఎంతో కీలకం. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు మాత్రం కార్తికేయ సినిమాను చూడాల్సిందేనని అంటున్నాడు.
Nagababu: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు వరుణ్ తేజ్. సాక్షి వైద్య హీరోయిన్గా నటించిన మూవీ ఆగస్టు 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమా పై వరుణ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ఆర్స్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన ‘బెదురు లంక 2012’ మూవీ కూడా 25నే థియేటర్లోకి రానుంది. కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయ ఎన్నో చిత్రాలు చేశాడు. ఒక్కటి కూడా ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ అందుకోలేదు. దాంతో ఈ సినిమాపైనే కార్తికేయ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇలా ఇద్దరికీ కూడా ఈ వారం రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. నాగబాబు మాత్రం కార్తికేయ సినిమాను చూసి తీరాల్సిందేనని అంటున్నాడు. కొడుకు సినిమా రిలీజ్ పెట్టుకొని కార్తికేయ సినిమాను ప్రమోట్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. సోషల్ మీడియాలో కార్తికేయ గురించి స్పెషల్ పోస్ట్ చేశాడు నాగబాబు.
మెగా ఫ్యాన్‌గా ఉండటం మనకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. మరియు మనం మెగాస్టార్ నుంచి ప్రేరణ పొంది, వారిలా మారాలని ఆకాంక్షించినప్పుడు, అది మెగా అభిమానిగా ఉండటానికి నిజమైన అర్ధాన్ని ఇస్తుంది. @actorkartikeya ఈ విషయంలో ఇది ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ అందమైన హంక్కి తను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అతని రాబోయే చిత్రం “బెదురులంక” రేపు విడుదలై అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సమీపంలోని థియేటర్లో సినిమాను చూడటం మర్చిపోవద్దు! అంటూ రాసుకొచ్చాడు. ఈ లెక్కన కొడుకు సినిమా కంటే కార్తికేయ సినిమాకే నాగబాబు సపోర్ట్ చేసినట్టుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.