NTR And Mokshagna: నందమూరి నట వారసులు ఓకే ఫ్రేమ్‌పై ఇటీవల కనిపించారు. నందమూరి సుహాసిని కుమారుడి వివాహాం ఇటీవల జరిగింది. పెళ్లి ఏర్పాట్లను ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దగ్గరుండి మరీ చూసుకున్నారు. పెళ్లికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా వచ్చాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇతరులతో మాట్లాడాడు.
ఎన్టీఆర్, మోక్షజ్ఞ ఇద్దరూ హాట్ చేసుకున్నారు. వారిద్దరూ కలిసి మాట్లాడుతుంటేనే కెమెరాలు క్లిక్ మన్నాయి. ఇక హగ్ చేసుకుంటే.. వీడియోలు తీశారు. అలా ఆ ఫోటో/ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. వావ్.. అన్నదమ్ములు.. భలే ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్.. దేవర మూవీతో బిజీగా ఉండగా.. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సినిమాల్లో నటించేందుకు విదేశాల్లో మోక్షజ్ఞ ట్రైన్ అయ్యారని తెలిసింది. సో.. త్వరలో మోక్షజ్ఞ మూవీ ఉండనుంది. కథ, డైరెక్టర్ కోసం బాలయ్య.. ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే ఫ్రేమ్‌లో మోక్షజ్ఞ- ఎన్టీఆర్ కనిపించడం ఆ పిక్కు ఇంపార్టెన్స్ ఏర్పడింది. వావ్.. అంటూ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు.