మళయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి విషయంలో మాత్రం నిత్య గురించి ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. తాజాగా మరోసారి అమ్మడి పెళ్లి న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Nitya Menon: తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లానాయక్’లో నటించింది నిత్య మీనన్. ఆ తర్వాత ధనుష్ నటించిన ‘తిరు’ అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించింది. ప్రస్తుతం తెలుగులో అమ్మడి చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. మళయాళం, తమిళ్లో మాత్రం కొన్ని సినిమాలు చేస్తోంది. హిందీలోనూ కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఈ మధ్య నిత్య సినిమాల విషయాల కంటే పర్సనల్ లైఫ్ పరంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
ముఖ్యంగా ఆ మధ్య నిత్య పెళ్లి, ఫలానా హీరోతో డేటింగ్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఓ మలయాళ హీరోను పెళ్లి చేసుకోబోతుందని కూడా వినిపించింది. ఎవరా హీరో అనేదే అంతుబట్టకుండా పోయింది. అలాగే ఇప్పట్లో నిత్య మీనన్ పెళ్లి ఉండే ఛాన్స్ లేదనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మరోసారి నిత్య పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే ఈ బొద్దుగుమ్మ ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందట. ఇప్పటికే పేరెంట్స్ నిత్యను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. పైగా తన తోటి హీరోయిన్లు ఒక్కొక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు.
ఇక చేసేది లేక నిత్య మీనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. నిత్య ఎవరితో ప్రేమలో ఉంది.. ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ గతంలో తన పెళ్లి గురించి తానే క్లారిటీ ఇస్తానని చెప్పింది నిత్య. కాబట్టి అమ్మడు చెప్పెవరకు ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడదనే చెప్పాలి.