»Emraan Hashmi Sujith On The Sets Of Pawan Kalyan Og Latest Photo Leaked
OG Leak: ఓజీ సెట్స్ నుంచి ఫోటో లీక్.. సోషల్ మీడియాలో హల్ చల్
పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ పరిసరాల్లో వేసిన ఓజీ సెట్ నుంచి తాజాగా ఒక ఫోటో లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
OG Leak : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న తాజా గ్యాంగస్టర్ చిత్రం ఓజీ(OG). యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తమిళ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ రోమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) విలన్ గా కనిపించబోతున్నాడు. వీరితో పాటు స్టార్ క్యాస్టింగ్ అర్జున్ దాస్(Arjun Das), శ్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిసున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో వేసిన ప్రత్యేక సెట్లో ఇమ్రాన్ హష్మి పాల్గొన్నారు.
తాజాగా సెట్లో ఇమ్రాన్ హష్మి(Emraan Hashmi)కి సంబంధించిన ఒక పిక్ బయటకి వచ్చింది. దానిలో ఇమ్రాన్ ఫుల్ గడ్డంతో టాప్ టు బాటమ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపిస్తున్నాడు. ఆ పిక్ చూసిన కొందరు నెటిజెన్స్ కాంమెంట్స్ చేస్తున్నారు. విలన్ గ్యాంగ్ స్టార్‌గా కనిపించబోతున్న ఈయన చాలా స్టైలిష్‌గా ఉన్నాడని, విలన్ కూడా ఇంత రొమాంటిక్ గా ఉంటాడని ఇమ్రాన్ హష్మిని చూశాకే అర్ధమవుతుందని ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో ఇమ్రాన్ హష్మికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. రోమాంటిక్ సీన్ లేకుండా ఆయన సినిమాలు ఉండేవి కావు. ప్రస్తుతం ఆయన జోరు తగ్గింది. మరీ ఓజీ చిత్రంతో ఆయన లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో గాని, 2024 సంక్రాంతిలో గాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన హంగ్రీ చీతా (HungryCheetha) గ్లింప్స్ ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా గ్లింప్స్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ రివీల్ అయింది. తమన్ అదిరిపోయే అప్డేట్ రెడీ చేస్తున్నాడు.