»A Young Man Commits Suicide Because He Is Not Getting Married
Hyderabad: పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
నూరేళ్లు బతకాల్సిన జనం.. ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదని కొందరు, డబ్బులు లేవని మరికొందరు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు ఇలా తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు .
Hyderabad: నూరేళ్లు బతకాల్సిన జనం.. ఆవేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉద్యోగం రాలేదని కొందరు, డబ్బులు లేవని మరికొందరు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కొందరు ఇలా తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు . ఏవైనా సమస్యలుంటే.. జీవితంలో పోరాడి సాధించాలి కానీ ఇలా పిరికిపందగా నిశ్చయించుకుని ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదు. చనిపోయిన వారు లోకాన్ని వదిలి బాగానే ఉంటారు. అయితే వారి తల్లిదండ్రులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోతారు. ఇటీవల ఓ యువకుడు పెళ్లి కావట్లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేటలో చోటుచేసుకుంది.
పెళ్లి కాలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత రాత్రి ఇంట్లో తండ్రితో గొడవపడి ఓ యువకుడు జిల్లెలగూడలోని సందన చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు చంపాపేటకు చెందిన నాగరాజు(28)గా గుర్తించారు. యువకుడు ఓ లాయర్‌తో కలిసి పనిచేసేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.