Another Four Programmes Are To Launched In 100 Days
CM Revanth Reddy: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తోంది రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం. తొలుత మహాలక్ష్మీ పథకంలో భాగంగా అతివలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. దాంతోపాటు ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచే మరో పథకానికి అంకురార్పణ చేశారు.
‘డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తెలంగాణ తల్లి అంటే సోనియా రూపం కనిపిస్తోంది.. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం సోనియా ఇచ్చారు. ఇక్కడి ప్రజల కోసమే ఆరు గ్యారంటీలను ఇచ్చారు. అందులో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం.. ఈ రోజు మహిళలు రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది’ అని సీఎం రేవంత్ తెలిపారు.
ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రూ.2 కోట్ల చెక్కును తెలంగాణ ప్రభుత్వం తరఫున నిఖత్ జరీన్‌కు అందజేశారు. ఎమ్యెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (vikramarka), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam), శ్రీధర్ బాబు (sridhar babu) తదితరులు పాల్గొన్నారు.