రేవంత్ సీఎంగా ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి సమస్య గురించి అప్ డేట్స్ ఉంటాయి. సీఎంను కలిసే ముందు హెల్ప్ డెస్క్ వద్ద ఇష్యూ నమోదు చేస్తారు. ఆ సమయంలో మొబైల్ నంబర్ తీసుకుంటారు. సమస్య పరిష్కారం గురించి రిఫరెన్స్ నంబర్ ఇస్తూ.. మొబైల్ ఎస్సెమ్మెస్ అందజేస్తుంటారు.
Praja Darbar: సీఎంగా ప్రమాణం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టిన మరునాడే రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ (Praja Darbar) నిర్వహిస్తూ వస్తున్నారు. జనం నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. సీఎం రేవంత్‌ను కలిసేందుకు జనాలు భారీగా వస్తున్నారు. దీనిపై కొందరు అప్పుడే విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెడుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్ రావు నిర్వహించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా షేర్ చేసింది. దీంతో ప్రజా దర్బార్‌లో (Praja Darbar) ఇచ్చిన ఫిర్యాదు, పరిష్కారం గురించి సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ప్రజా భవన్లో సీఎం రేవంత్, మంత్రులు, అధికారుల వద్దకు జనం వచ్చి సమస్యను చెబుతున్నారు. అంతకుముందే హెల్ప్ డెస్క్ వద్ద సమస్యను నమోదు చేస్తున్నారు. ఆ ఇష్యూను సీఎం వద్దకు తీసుకొస్తున్నారు. ఏ సమస్య అయిన సరే లిఖితపూర్వకంగా ఉంటుంది. డేటా కూడా సీఎంవో మెయింటెన్ చేస్తోంది. అలాగే రోజు ఎంతమంది వచ్చారు..? వారి సమస్యలు ఏంటీ… ఎప్పటి వరకు పరిష్కారం అయ్యాయి.. తదితర అంశాల పూర్తి డేటా ఉంది.
ఏదో ప్రజా భవన్ వచ్చాం, సీఎంను కలిసాం అన్నట్టు ఉండదు. కొందరు అప్పుడే ఆర్జీలను పక్కన పడేస్తారనే విమర్శలు కూడా చేస్తున్నారు. ఏ ఇష్యూ అయిన సరే.. పరిష్కారం అయ్యే వరకు మీ అప్ డేట్ వస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేస్తూ ఉంటారు. ఆ మేసెజ్‌లో రిఫరెన్స్ నంబర్ కూడా ఉంటుంది. ఆ మేసెజ్ చీఫ్ మినిస్టర్ గ్రీవెన్స్ సెల్ నుంచి వస్తోంది. రిఫరెన్స్ నంబర్ ఆధారంగా సమస్య పరిష్కారానికి సంబంధించిన ఇన్ఫోను ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సీఎం రేవంత్ చేపడుతోన్న ప్రజా దర్బార్‌కు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ సమస్యలు పరిష్కారం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై పాజిటివ్ పెరుగుతోంది.