»Girlfriend Dharna In Front Of Her Boyfriends House Who Promised To Marry Her Khammam District
Woman protest: పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
మారుతున్న పరిస్థితుల కారణంగా రోజురోజుకు మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇచ్చిన మాటలు అనేక మంది నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Girlfriend dharna in front of her boyfriend's house who promised to marry her khammam district
ఇటివల కాలంలో ప్రేమిస్తున్నాని చెప్పి మహిళలను అబ్బాయిలు శారీరకంగా లోబర్చుకునే సంఘటనలు పెరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇదే కోవలోకి మరో సంఘటన వచ్చి చేరింది. ఇది ఖమ్మం జిల్లా(khammam district) కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన ప్రియుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకుని నిరాకరించడంతో అతని ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేసింది.
అదే గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని అదే ప్రాంతానికి చెందిన బీసీ వర్గంలోని గోపాలకృష్ణ అనే యువకుడు ఇన్ స్టా గ్రాం(instagram)యాప్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ పరిచయం చేసుకున్న క్రమంలో ఒకరికి ఒకరు తెలియదు. కానీ వారి మధ్య ఉన్న పరిచయం కాస్తా పెరగడంతో తర్వాత వారు ఒకే ప్రాంతం వాసులమని తెలుసుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ నేపథ్యంలోనే వారిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
దీంతో ఆ యువకుడి మాటలు నమ్మిన యువతి తనతో శారీరకంగా కలిసింది. అలా పలుమార్లు జరిగిన తర్వాత ఆ యువతి పెళ్లి(wedding)ప్రస్తావన తీసుకురావడంతో అతను ముఖం చాటేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు తనకు న్యాయం చేయాలని శనివారం ప్రియుడి ఇంటి ఎదుట కూర్చుని మౌన పోరాటం చేస్తుంది. అయితే ఆ యువతి చలిని సైతం లెక్కచేయకుండా నిరసన తెలపడం విశేషం. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అతను ఇప్పుడు ఇచ్చి మోసం చేశాడని యువతి చెబుతోంది.