four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ మూడవ అంతస్తులోని కార్యాలయంలో ఫైల్స్ చోరీకి గురయ్యారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి చోరీ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఆ ఫైల్స్ ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారనే విషయాలు మాత్రం తెలియడం లేదు. అయితే ఇదే కార్యాలయంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha indra reddy) పనిచేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ ఆఫీసుకు పలువురు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని అక్కడి నుంచి దుండగులు పరారైనట్లు పలువురు చెబుతున్నారు.
మరోవైపు నిన్న మాజీ పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓస్డీ ఆఫీస్లో ఫైల్స్ మిస్సైన ఘటన తర్వాత ప్రస్తుతం ఇక్కడ కూడా అలాగే జరగడం కలకలం రేపుతోంది. అయితే అసలు గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ఏదైనా అక్రమాలకు పాల్పడ్డారా అనే సందేహాం అనేక మందిలో మొదలైంది. నిజాయితీగా పనిచేస్తే ఫైల్స్ ఎందుకు కనపించకుండా పోతాయని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.