Karthik reddy:తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు నియోజకవర్గ పర్యటనల్లో బిజీగా ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించేవారు ఎక్కువ మందే ఉన్నారు. సిట్టింగులకే టికెట్లు ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ (cm kcr) ప్రకటించారు. అయినప్పటికీ ముఖ్య నేతలు తమ శక్తి మేరకు లాబీయింగ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) కుమారుడు కార్తీక్ రెడ్డి (karthik reddy) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానం గురించి ప్రకటించారు. సోమవారం రాజేంద్రనగరలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజేంద్రనగర్ (rajendra nagar) నుంచి బరిలోకి దిగుతానని కార్తీక్ రెడ్డి (karthik reddy) స్పష్టంచేశారు. ఇక్కడినుంచి ఎవరైనా పోటీ చేయాల్సి వస్తే తనే చేస్తానని చెప్పారు. తన తల్లి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం (maheshwaram) నుంచి బరిలోకి దిగుతారని చెప్పారు. తనకు సీటు వదిలేయండయ్యా అంటూ సరదాగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధిస్తాననే ధీమాతో కార్తీక్ రెడ్డి (karthik reddy) ఉన్నారు.
రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్ గౌడ్ (prakash goud) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వరసగా మూడుసార్లు ఇక్కడినుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014, 2018లో పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను తీసి.. కార్తీక్ రెడ్డికి (karthik reddy) అవకాశం దక్కుతుందటే కాస్త కష్టమే. ఇప్పటికే సీఎం కేసీఆర్ (cm kcr) అభ్యర్థులను మార్చబోనని ప్రకటించారు. దీంతో కార్తీక్ (karthik) సీటు విషయంలో కాస్త ఆలోచిస్తారు. ప్రకాశ్ గౌడ్ వరసగా 3 సార్లు గెలవడం.. ఆయనకు నియోజకవర్గంలో ఉన్న పట్టును తెలియజేస్తోంది. కార్తీక్ మాత్రం తగ్గేది లేదు.. తానే పోటీ చేస్తానని అంటున్నారు. కుమారుడి టికెట్ కోసం సబితా లాబీయింగ్ చేస్తే.. అదీ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలీ.