JC Diwakar reddy demands on rayalaseema to merge telangana
JC Diwakar reddy:మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar reddy) కొత్త ప్రతిపాదన చేశారు. రాయల తెలంగాణ (Rayala telangana) అయితే బాగుంటుందని చెబుతున్నారు. రాయలసీమను తెలంగాణ రాష్ట్రంలో కలుపాల్సిందేనని కోరుతున్నారు. అప్పుడు కష్టాలు తీరతాయని చెప్పారు. రాష్ట్రాలను విభజించడం కష్టం కానీ.. కలుపడం తేలికే అని చెప్పారు.
రాయలసీమను (Rayalaseema) తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండవని చెప్పారు. కొందరు అయితే ప్రత్యేక రాయలసీమ కావాలని కోరుతున్నారు. అలా ఏర్పడిన తమకు సంతోషమేనని పేర్కొన్నారు. జేసీ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చకు వచ్చింది. సీమను తెలంగాణలో కలుపాలా..? కలుపుతారా అనే డిస్కషన్ తెరపైకి వచ్చింది.
చదవండి: Avinash reddyకి సుప్రీంకోర్టులో షాక్. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేత
రాష్ట్ర విభజన సమయంలో కూడా రాయల తెలంగాణ (Rayala telangana) ప్రతిపాదన వచ్చింది. అందుకు అప్పటి ఉద్యమనేత కేసీఆర్ (kcr) అంగీకరించలేదు. హైదరాబాద్ (hyderabad) లేకుండా తెలంగాణ అని ప్రతిపాదన కూడా చేశారు. హైదరాబాద్ తమకు మొండెం అని.. సిటీ లేకుంటే ఎలా అని అప్పట్లో చెప్పారు. దీంతో తెలంగాణ ప్రజాభీష్టం మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
దాదాపు 9 ఏళ్ల తర్వాత జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar reddy) మళ్లీ సీమ రాగం అందుకున్నారు. దీనిపై రాజకీయ పార్టీలు/ నేతల నుంచి ఎలా రిప్లై వస్తుందో చూడాలీ మరీ.