BRS: లోక్సభ ఎన్నికల వేళా తెలంగాణలో తీవ్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగులుతుంది. ఈ మేరకు మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు పలురకాల హామీలు, చర్చలు జరిపేందుకు ఆయన అనుచరులతో కలసి ఇవాళ సీఎంను కలిశారు. ఇక ఈరోజు లేక రేపు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరబోతున్నట్లు ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
అయితే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడి కాంగ్రెస్లో కలుస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీలో కలవరం నెలకొంది. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే లోపు ఇంకెంత మంది పార్టీ వీడుతారో అనే ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని నింపేందుకు అగ్రనేతలు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు
పాటు పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అది సరైన పద్దతి కాదని అప్పుడు తెలుసుకోలేకపోయాము, ఇకపై కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు.