»Ktr Congress Betrayed Everyone Including The Unemployed During Its 120 Day Rule
KTR: కాంగ్రెస్ 120 రోజుల పాలనలో నిరుద్యోగులతో పాటు అందరికీ ద్రోహం చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది. ఇన్ని రోజుల పాలనలో నిరుద్యోగులతో పాటు అందరినీ ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
KTR: Congress betrayed everyone, including the unemployed, during its 120-day rule
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది. ఇన్ని రోజుల పాలనలో నిరుద్యోగులతో పాటు అందరినీ ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ మాట ఇచ్చారు. అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందని కేటీఆర్ అన్నారు.
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!
అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది.
అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దీనిపై యూటర్న్ తీసుకోవడంతో పాటు టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు పెంచందని కేటీఆర్ మండిపడ్డారు. బల్మూరి వెంకట్ వంటి నాయకులు కోర్టులో కేసులు వేసి పోటీ పరీక్షల రద్దుకు గతంలో కారణమయ్యారు. ఇప్పుడు అతను ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు.